టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టడంలో దిట్ట అయిన త్రివికిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, హారిక హాసిని క్రిఐషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్,

 

థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు ముఖ్యంగా పాటలు అయితే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ దక్కించుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పడం జరిగింది. 
ఇక ఈ సినిమాతోపాటే సరిగ్గా ఒకరోజు ముందుగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరికిలేరు నీకెవ్వరు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకెళ్తుండగా, అలవైకుఠపురములో టీమ్ మరొక అడుగు ముందుకు వేసి, బన్నీతో ఏకంగా ప్రముఖ బాలీవుడ్ మీడియా మాధ్యమం బాలీవుడ్ హంగామా వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పించింది. ఎక్కువశాతం హిందీ సినిమాలను ప్రమోట్ చేసే ఈ మీడియా ఛానల్ వారు, బన్నీతో ఇంటర్వ్యూ నిర్వహించారు. వారు అలవైకుంఠపురములో సినిమాను ప్రమోట్ చేయడానికి ఆ సినిమా సాంగ్స్ ఎంతో గొప్పగా సక్సెస్ కావడం తోపాటు, సినిమా మరింత ఎక్కువమందికి చేరుతుందనేది కూడా ఒక కారణం అని తెలుస్తోంది. 

 

ఇక వారితో ఇంటర్వ్యూ లో భాగంగా సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలు, అలానే సాంగ్స్ గురించి మాట్లాడిన బన్నీ, సినిమాపై తమ యూనిట్ కు ఎంతో మంచి నమ్మకం ఉందని, తప్పకుండా సక్సెస్ సాధించి అందరి మన్ననలు అందుకుంటాం అని చెప్పారు. అయితే సరిలేరు నీకెవ్వరు టీమ్ కంటే ఒకడుగు ముందుకు వేసి, ఏకంగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి తమ సినిమా రీచ్ ని మరింతగా పెంచేలా ప్లాన్ చేసిన బన్నీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ అని, ఆయన ముందు మెగాస్టార్, సూపర్ స్టార్స్ కూడా పనికి రారని, పలువురు నెటిజన్లు బన్నీపై సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: