కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రేక్షకాదరణ మరియు లభిస్తున్న రేటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే షోల్లో అత్యధిక స్థాయిలో ఈ రెండు విభాగాల్లో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ కూడా ఒకటి అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఈ షో ద్వారా, ఆ ఛానల్ ఆదాయం, పేరు మరింతగా పెరిగాయనే చెప్పాలి. ఇక షో మొదటి నుండి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తుండగా, ఇటీవల నాగబాబు షో నుండి అర్ధాంతరంగా బయటకు రావడం జరిగింది. ఆ షోలో కొందరు మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకనే బయటకు వచ్చినట్లు ఒక వీడియో ద్వారా నాగబాబు తెలిపారు. కాగా అదే సమయంలో నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ నుండి  బయటకు రావడం జరిగింది. 

 

అయితే వారిద్దరూ బయటకు వచ్చిన సమయంలో షో గురించి, నాగబాబు గారితో షో నిర్వాహకుల్లో కొందరు గొడవపడ్డట్లు, అలానే తామిద్దరితో పాటు బయటకు వద్దాం అనుకున్న కొందరు పార్టిసిపెంట్స్, హఠాత్తుగా మాపై కోపంతో మనసు మార్చుకున్నారని, ఇలా పలు విధాలుగా పుకార్లను ప్రచారం అయ్యాయని నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చమ్మక్ చంద్ర చెప్పడం జరిగింది. అయితే అసలు ఆ షోలో జరిగిన వాస్తవాలు ఎవరికీ తెలియవని, జరిగినది ఏంటో నాకు తెలుసని అసలు నిజాలు చెప్పడం జరిగింది. నిజానికి నాగబాబు గారు, నేను షో నుండి బయటకు వద్దాం అనుకున్నపుడు తమతో ఎవరూ కూడా ఎటువంటి గొడవ పడలేదని, కాకపోతే షో మేనేజ్మెంట్ లోని కొందరి ప్రవర్తన నచ్చకపోవడంతో పాటు, 

 

అంతకముందు ఆ షో ని ఎప్పటినుండో కోఆర్టినేట్ చేస్తున్న ఇద్దరు యువ మేనేజర్లు బయటకు రావడం నాగబాబు గారిని బాధించిందని, కొన్నాళ్ళు వారికి ఎక్కడా పని దొరకలేదని, ఆ తరువాత అనుకోకుండా మరొక ఛానల్ లో ఇటువంటి తరహా షోనే వారిద్దరూ కలిసి ప్రారంభించబోతున్న విషయం నాగబాబు గారికి వారు తెలపడంతో, వారిద్దరికీ తన వంతుగా సాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే నాగబాబు గారు బయటకు వచ్చారని అన్నాడు చంద్ర. అలానే తనకు కూడా జబర్దస్త్ టీమ్ తో ఎటువంటి గొడవలు లేవని, తాను కూడా నాగబాబు గారి మాదిరిగా వారిద్దరికి వీలైనంత సాయం అందించడానికి బయటకు వచ్చినట్లు చెప్పాడు. అయితే ఆ షో నుండి బయటకు వచ్చినప్పటికీ దాదాపుగా అక్కడిచ్చే రేంజ్ లోనేతమకు  ఇక్కడ కూడా రెమ్యూనరేషన్ లభిస్తోందని, ఇక తమతో పాటు బయటకు వద్దాం అనుకున్న వారి గురించి నేను మాట్లాడడం సరికాదు, ఎవరి ఇష్టాయిష్టాలు వారికీ ఉంటాయి అని చంద్ర చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: