అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కి సిద్దమయింది. సంక్రాంతి కానుకగా 11 న థియోటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమే నమ్మకంగా అనిల్ ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాడంటే అందుకు సమాధానం సరిలేరు అనిల్ ఫ్యూచర్ డిసైడ్ చేయబోతోంది... అని. షాకింగ్ గా ఉంది కదూ ఒక సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఇలాంటి ఆన్సర్ ఏంటి అని. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్.

 

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. ఇక చరణ్ పార్ట్ మార్చి నాటికి పూర్తి కానుందట. అటుపై డబ్బింగ్.. ప్యాచ్ వర్క్ లకు ఇంకొంత సమయం కేటాయిస్తాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాపై ఫోకస్ చేస్తాడు. ఈ సినిమాని చరణ్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కి కావాల్సిన అన్ని పనులను ఏర్పాటు చేసి రిలాక్స్ అవుతాడు. ఇక ఈ సినిమాలో ఓ చిన్న కామియో పాత్రలో కూడా కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది.

 

అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఏమిటి అన్నది ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతోంది. ఆర్.ఆర్.ఆర్ సక్సస్ పై ధీమాగా ఉన్నాడు! అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికి ఆ క్రెడిట్ జక్కన్న, తారక్, చరణ్ పంచుకోవాల్సి వస్తుంది. అందుకే సోలోగా బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసే సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడట చరణ్. ఈ నేపథ్యంలోనే పలువురు దర్శకులు చరణ్ కి స్క్రిప్ట్ లు వినిపించి రెడీగా ఉన్నారు. ఇందులో ఎఫ్-2 దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఉన్నట్లు తాజా సమాచారం. చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గ కమర్శియల్ స్టోరీ అనీల్ రావిపూడి వినిపించాడని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 

అయితే చరణ్ నుంచి ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ సరిలేరు గనక బ్లాక్ బస్టర్ కొడితే అనీల్ కు ఒకే చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది సరిలేరు మీదే ఆధారపడి ఉంది. ఖచ్చితంగా అనిల్-చరణ్ కాంబో డిసైడ్ చేసేది సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అని. సరిలేరు పై ఇప్పటికే మహేష్ సహా అనీల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ గనక అందుకుంటే అనీల్ కి మెగా కాపౌండ్ లో చరణ్ బెర్త్ కన్ఫమ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే సరిలేరు అనిల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: