నాగబాబు వెళ్లిపోయిన తరువాత ఎందరో టాలీవుడ్ సినీ హీరోలు జబర్దస్త్ కు తరచుగా వచ్చి వెళ్తున్నారు. నాగబాబు సీట్ లో ఎంతమంది కూర్చున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరు పర్మినెంట్ గా జడ్జి బాధ్యతలను చేపట్టలేదు. హీరోలు ప్రతి వారం వచ్చి జబర్దస్త్ అభిమానులను అలరిస్తుండగా.. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ సీనియర్ హీరో పృథ్వి జబర్దస్త్ లో ఎంటర్ అయి రచ్చ రచ్చ చేశాడు.

 


నిన్న రిలీజ్ అయినటువంటి జబర్దస్త్ ప్రోమో లో ఇతను చేసినటువంటి సిక్స్ ప్యాక్ ఫ్రీ షో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పృథ్వి రుక్కు రుక్కు రుక్కుమని బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్లే గానే పోలీస్ డ్రెస్ లో వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆ తర్వాత ఒక స్కిట్ చేస్తూ హాస్య చతురతను విసురుతాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క తమ్ముడు మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఇతను షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తాడు. చూపించిన కాక తన సిక్స్ ప్యాక్ బాడీ పై తన వేళ్ళను కిందికి తీసుకొస్తుంటే.. అనసూయ సెగ సిగ్గుపడుతూ ఉంటుంది. రోజా మాత్రం ఇదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అతడు తన కండలను కూడా చూపించి బాడీ షోని ముగిస్తాడు.


ఇకపోతే గతంలో పృద్వి అనేక సినిమాల్లో నటించే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇలాంటి సినిమాలు అతని నటనకు గాను చాలా మంచి పేరు లభించింది. అదేవిధంగా రోజా తో కూడా అనేక సినిమాల్లో పృథ్వి నటించాడు. ఏమైనా ఒక ఫ్యామిలీ షోలో బట్టలు ఇచ్చి ఆడోళ్ళ ముందు చూపించడం సరికాదని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే ఇతడి ఓవరాక్షన్ చాలా ఎక్కువైయిందని ఇంకొక కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎపిసోడ్ 16 వ తారీఖున ఈటీవీ లో ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: