హ్యాట్రిక్ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ చిత్రం ( జ‌న‌వ‌రి 11) సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మ‌హేష్ అభిమానులే కాక సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ చిత్రం కోసం చాలా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇచ్చిన ఇంటర్య్వూస్‌లో ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సినిమా పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. చిత్ర యూనిట్ అంతా ఎవ్వ‌రు చూసిన బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటున్నారు. ఈసారి మహేష్ కూడా చాలా క‌న్ఫిడెంట్‌గా ఉన్నారు. 


పెద్ద హీరోల సినిమా రివ్వ్యూ లంటేనే చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు మ‌హేష్ అభిమానుల‌కు ఒక సూప‌ర్ గుడ్ న్యూస్ చెప్పారు. అదిఏమిటంటే... ముంబైకి చెందిన‌ మూవీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎలా ఉందో చెప్పారు. ఆయన సినిమా ఎక్కడ చూశారో తెలీదు కానీ శుక్రవారం సాయంత్రం ట్విట్టర్‌లో రివ్యూను ట్వీట్ చేశారు. సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్ ప్యాకేజ్ అని పేర్కొన్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అద్భుతమని తెలిపి  శివ.. మొత్తంగా 3.5 రేటింగ్ ఇచ్చారు. ఎంతో మంచి అద్భుత‌మైన రేటింగ్‌తో మ‌హేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీని ఇచ్చారు. ఇటీవల కాలంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మంచి సినిమా ఇదని అన్నారు. బాక్సాఫీసు వద్ద కచ్చితంగా విజయవంతమయ్యే సినిమా అని స్పష్టం చేశారు.


సినిమాలోని అంశాల వారీగా రేటింగులు ఇచ్చారు శివ. మహేష్ బాబుకి  అలాగే అందులోని టెక్నీషియ‌న్స్‌కి ప్ర‌తి ఒక్కొక్క‌రికి ఒక్కో రేటింగ్ ఇచ్చి సినిమా వ్యాల్యూ పెంచేశారు. సినిమా విడుదల కాకముందే రివ్యూ ఇచ్చిన శివ సత్యం పై ట్విట్టర్‌లో కొంత మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మిగిలినవారు శివను తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనప్ప‌టికీ సోష‌ల్ మీడియా వ‌చ్చినప్ప‌టినుంచి ఇలాంటి వ‌న్నీ ఎక్కువ‌యిపోయాయి.  రేపు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైపోతుంది. అలాగే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా పడతాయి కాబట్టి ఉదయానికల్లా సినిమా టాక్ తెలిసిపోతుంది.  ఇంత‌కీ బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న‌మాట. అస‌లు విష‌యం ఏమిట‌న్న‌ది తెలియాలంటే కాస్త తెల్ల‌వారు వ‌ర‌కు ఆగాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: