సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఆయన సినిమా వస్తుందంటే హీరోలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక సామాన్య జనం, ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వరల్డ్ వైడ్‌గా రజనీ అభిమానులను సంపాదించుకున్నాడు అని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు కూడా. ఇకపోతే నిన్న అంటే గురువారం జనవరి 9న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్భార్ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

 

 

ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక వివాదం లో చిక్కుకుంటుందన్న విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు కూడా కోర్టు నుండి సమన్లు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వివాదంలో దర్బార్ సినిమా నిలిచింది. అదేమంటే మాజీ అన్నాడీఎంకే నేత శశికళని కించపరిచే విధంగా ఈ చిత్రంలోని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ డైలాగ్స్‌ని వెంటనే తొలగించాలని శశికళ తరపు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు.

 

 

ఈ క్రమంలో దర్బార్ చిత్ర యూనిట్ అవి కేవలం సన్నివేశం కోసం మాత్రమే ఉన్నాయని.. వాటిలో మరే ఉద్ధేశం లేవని సంజాయిషి ఇచ్చుకుంది. కాని ఈ డైలాగ్స్ శశికళను ఉద్ధేశించి అన్నారని శశికళ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.. ఇకపోతే ఈ మధ్య శశికళ జైలు నుంచి బయటకెళ్లి షాపింగ్ చేశారనే వార్తలు తమిళనాట అంతటా  వైరల్ అయ్యాయి.

 

 

ఈ నేపధ్యంలో దర్బార్ చిత్రంలో ఉన్న ఓ జైలు సన్నివేశంలో, ముంబై పోలీసు కమిషనర్ హోదాలో రజనీ వెళ్తుంటే.. ఓ ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ డబ్బులుంటే ఖైదీలు షాపింగ్‌కి కూడా వెళ్లవచ్చు’ అనే డైలాగ్ ఉంటుంది.

 

 

ఈ డైలాగ్ పట్టుకుని ఇప్పుడు తమిళనాడులో శశికళ వర్గం రచ్చ రచ్చ చేస్తుంది. అంతే కాకుండా, శశికళ తరపు న్యాయవాది కూడా ఈ డైలాగ్స్‌ని వెంటనే సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేయడం వింతగా అనిపిస్తుందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.. ఇక సినిమాని సినిమాలాగ చూడాలి గాని వాటిని నిజ జీవితంలోకి అన్వయించుకోవడం ఏంటని మరికొందరి వాదన...

 

మరింత సమాచారం తెలుసుకోండి: