సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలే సమయం మాత్రమే ఉంది. ఇంకా ఎన్ని గంటలు బాబూ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ అలాగే ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు 13 ఏళ్ళ తర్వాత లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక అద్భుతమైన పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అయ్యారు. 

 

ఇక మహేష్ పైకి క్లాస్ హీరోగా కనిపిస్తున్నప్పటికి పోకిరి, బిజినెస్ మాన్ వంటి సినిమాలతో విపరీతమైన మాస్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు. అంతేకాదు కొరటాల శివతో కలిసి మహేష్ బాబు సామాజిక అంశాలు ఉన్న సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను ఆ కోవలోకి వచ్చేవే. ఇక మహేష్ దూకుడు వంటి ఓక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో బాక్సాఫీస్ దగ్గర చేసే సందడి అంతా ఇంతా కాదు.  అందుకే మహెష్ మహర్షి తర్వాత అనిల్ రావిపూడితో కమిటయ్యాడు.

 

అనిల్ కి మంచి కామెడీ టైమింగ్ తో పాటు హీరోని ఎలివేట్ చేసే సత్తా బాగా ఉంది. ఇక ఫ్యామిలీ పరంగా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్స్ ని బాగా పండిగల సత్తా పుష్కలంగా ఉంది. ఇవన్ని సరిలేరులో బాగా దట్టించాడట. ఇప్పటికే ఈ సినిమా యు.ఎస్ లో కొన్ని చోట్ల షోస్ పడ్డాయి. అక్కడి జనాలు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఫస్టాఫ్ అంతా కామెడి తో సెకండాఫ్ అంతా ఎమోషన్స్ తో సాగిందట. అంతేకాదు మహేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడట. ఇక మహెష్ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: