అనుకున్నది ఆలస్యం సూపర్ స్టార్ తో సరిలేరు నీకెవ్వరు పేరుతో సినిమాని మొదలు పెట్టి కేవలం 5 నెలల్లోనే కంప్లీట్ చేసి ఇండస్ట్రీలో చాలా మందికి షాకిచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మధ్య కాలంలో మహేష్ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయింది అంటే అది సరిలేరు మాత్రమే. అప్పుడెప్పుడో పూరి పోకిరి సినిమాని ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అనిల్ వల్లే సాధ్యమైంది. ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకే సరిలేరు సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది.

 

ఇక పటాస్ నుండి ఎఫ్ 2 వరకు వరుస హిట్స్ అందుకొని దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, కొరటాల శివ తర్వాత మళ్ళీ నాన్ స్టాప్ హిట్స్ ని అందుకున్నది అనీల్ రావిపూడి మాత్రమే. అందుకే మహేష్ బాబు ముందు వేరే డైరెక్టర్ తో సినిమా కమిటయి కూడా అనీల్ కి డేట్స్ ఇచ్చేశాడు. ఇది అనీల్ అసలు ఊహించనేలేదు. ఏకంగా సూపర్ స్టార్ కాల్ చేసి 'మనం సినిమా చేద్దామా ..మొన్న చెప్పిన కథ తీద్దామా' అంటే ఏ డైరెక్టర్ కి అయినా ఊపిరాడుతుందా.. కొంతసేపు అనీల్ పరిస్థితి కూడా అలానే అయిందట. అయితే అనీల్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలు ఒకెత్తైతే సూపర్ స్టార్ తో  'సరిలేరు'  సినిమాని చేయడం ఒకెత్తు. 

 

అందుకే ఖచ్చింతంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే తపనతో సరిలేరు ని తీర్చి దిద్దాడు అనీల్ రావిపూడి. ఎప్పుడు మొదలైంది..ఎప్పుడు కంప్లీటయింది అన్న ఆలోచన వచ్చేలా సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. ఇక ఏ డైరెక్టర్ ఇప్పటి వరకు మహేష్ ని చూపించనంత కొత్తగా అనీల్ చూపించాడు. ఆర్మీ గెటప్ లో మహేష్ అదిరిపోయాడు. ఇక ఈ సినిమా బెనిఫిట్ షోస్ ఇప్పటికే పడ్డాయి. మహేష్ ఫ్యాన్స్ కి సరిలేరు విపరీతంగా నచ్చేసింది. మహేష్ గత మూడు సినిమాలలో క్లాసిగా చూసి కాస్త బోర్ కొట్టిన అభిమానులకు సరిలేరులో మహేష్ పిచ్చ పిచ్చగా నచ్చాడు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే స్పెషల్ షోస్ చూసిన పబ్లిక్ 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అంటున్నారు.   
  

మరింత సమాచారం తెలుసుకోండి: