సరిలేరు నీకెవ్వరు సినిమా టైటిల్ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.. అందరిలోనూ కాదు ఆ సినిమా హీరోసినిమా దర్శకుడు మనసుల్లో ఈ సినిమా హిట్ ఒక ఛాలెంజ్ గా కూడా ఉంది. ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు హిట్ దర్శక హీరోలకు సరికొత్త రికార్డు సొంతం కాబోతుంది. తెలుగులో ఇంత వరకూ అపజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి తీసిన చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది భారీ విజయాన్ని అందుకోవడం తథ్యం. ఇది జగమెరిగిన సత్యం. దీంతో రాజమౌళి సినిమాని సంవత్సరాల తరబడి జక్కన్న లా చెక్కుతాడు అనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇందులో నిజం ఉన్నా నిర్మాతకు డబ్బులు తీసుకు వచ్చేది కాస్త ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదని కొందరి అభిప్రాయం.

 

దీంతో రాజమౌళి సినిమాని సంవత్సరాల తరబడి జక్కన్న లా చెక్కుతాడు అనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇందులో నిజం ఉన్నా నిర్మాతకు డబ్బులు తీసుకు వచ్చేది కాస్త ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదని కొందరి అభిప్రాయం. అనిల్ రావిపూడి ఇంతవరకు తీసిన నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్,రాజాదిగ్రేట్, ఎఫ్2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంతవరకూ అనిల్ రావిపూడి కి అపజయం తెలీదు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ తో అనిల్ రావిపూడి కూడా రాజమౌళి సరసన చేరి సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటారు. రాజమౌళి కన్నా అనిల్ రావిపూడి సినిమాని త్వరితగతిన పూర్తి చేస్తారని అభినందనలు కూడా ఉన్నాయి. 

 

ఇక ఈ సినిమాలో ముందు నుంచి మంచి అంచ‌నాల‌తో ఉన్న క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేష్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ బండ్ల‌న్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాడు. బండ్ల గ‌ణేష్ కూడా ఈ చిత్రంలో రీ ఎంట్రీ అనే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌ని ఆయ‌న ఆ మ‌ధ్య పాలిటిక్స్‌లో కాస్త హ‌డావిడి చేసిన సంగ‌తి తెలిసిందే.  ఓ ట్రైన్ గ్యాంగ్ స‌భ్యుడిగా ట్రైన్‌లో దూరి మ‌హేష్‌ను బెదిరించి.. ర‌ష్మిక‌తో పెళ్లి చేయాల‌ని ప్లాన్ చేస్తాడు. చివ‌ర‌కు మ‌హేష్‌ ఆ దొంగ‌ల గ్యాంగ్‌ను చిత‌క్కొట్టి పంపిస్తాడు. అక్క‌డ కాస్త కామెడీ జ‌న‌రేట్ అయ్యింది. ఏదేమైనా బండ్ల గ‌ణేష్‌ కామెడీ సినిమాలో బాగా హైలెట్‌గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: