సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమా క‌న్న‌డ బ్యూటి ర‌ష్మిక మందాన్నా హీరోయిన్‌గా న‌టించింది.  దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, అలానే థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అటు అభిమానులు ఇటు ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూవారు. 

 

అయితే ఆ స‌మ‌యం రానెవ‌చ్చేసింది. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న(నేడు) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఓవర్సీస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తున్నారు. అలాగే మ‌రోవైపు ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి చాలా ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తోంది. దీంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. దాదాపు 80 నిమిషాల పాటు ఫ‌స్టాఫ్ అంతా న‌వ్వుల‌తో థియేట‌ర్ అంతా ద‌ద్ద‌రిల్లింది. ఎందుకంటే ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే  ట్రైన్ ఎపిసోడ్ సీన్ అయితే ఓవర్ ఆల్ గా సినిమా మొత్తానికి అతి పెద్ద హైలైట్ అవుతుంది. 

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మంత్రి అయిన ప్ర‌కాశ్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చేట‌ప్పుడు నువ్వు చేసిన త‌ప్పు ఒప్పుకుని జైలుకు వెళ్లి బాధ్య‌త క‌ల పౌరుడు అని నిరూపించుకో అంటాడు.. ప‌క్క‌నే ఉన్న రాజేంద్ర‌ప్ర‌సాద్ అర్థ‌మ‌వుతుందంటావా అని అడుగుతాడు... వెంట‌నే మ‌హేష్‌ వీళ్లు ఏదో పార్టీలు మారుతుంటారు క‌దా.. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అని పార్టీ ఫిరాయంపులపై సెటైర్‌గా డైలాగ్ వేస్తాడు. ఓవ‌రాల్‌గా మంత్రి అయిన ప్ర‌కాశ్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చే టైంలో ఈ సీన్ వ‌స్తుంది..అంటే నేటి స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై పార్టీలు మారే రాజ‌కీయ నాయ‌కుల‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ డైలాగ్ వేసిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: