సూపర్ స్టార్ మహేష్, సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన భారీ సినిమా సరిలేరు నీకెవ్వరు. అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో మహేష్, దిల్ రాజులు కూడా నిర్మాణ భాగస్వామ్యులు అయ్యారు. సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సినిమాకు సంబందించిన మొదటి టాక్ బయటకు వచ్చేసింది. సినిమా అంతా మహేష్ మ్యానియా కొనసాగించడంతో పాటుగా అనీల్ రావిపుడి మార్క్ కామెడీతో తెరకెక్కించారని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే విజయశాంతి నటన. 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత విజయశాంతి భారతి రోల్ లో అదరగొట్టేశారని తెలుస్తుంది. ఇక సినిమాలో ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినట్టు తెలుస్తుంది. సినిమా కథ వీక్ గా ఉన్నప్పటికి కథనం ఎంటర్టైనింగ్ తో సాగించాడు అనీల్ రావిపుడి. క ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. అదేంటి మహేష్ సినిమాలో విజయ్ ఎలా ఉన్నాడని ఆశ్చర్యపోవచ్చు.

 

సరిలేరు నీకెవ్వరు భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ ను వదులుతున్నారట. రౌడీ హీరో మరోసారి విజృంభించి నటించిన సినిమా అది. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేశారు. డియర్ కామ్రేడ్ తో అంచనాలను అందుకోలేని విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తో భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మహేష్ సినిమాతో వస్తున్నాడు కాబట్టి విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సూపర్ ప్రమోషన్ దొరికినట్టే. సినిమా మీద విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: