ఓవ‌రాల్‌గా అతి సాదాసీదా క‌థ‌ను తీసుకుని అనిల్ రావిపూడి కామెడీ అల్లేసి చుట్టేశాడు. ఇటు మ‌హేష్ గ‌త హిట్ సినిమాలు మ‌హ‌ర్షి, భ‌ర‌త్‌, శ్రీమంతుడు సినిమాల‌తో పోల్చినా.. అటు అనిల్ రావిపూడి నాలుగు హిట్ సినిమాలు... ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్2తో కంపేరిజ‌న్ చేసినా కథ ప‌రంగా స‌రిలేరు వీకే. అయితే కామెడీ మాత్రం బాగా పేలింది. ఫ‌స్టాఫ్ ఇంకా సూప‌ర్‌.. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు  ఎక్క‌డా గ్రాఫ్ ప‌డిపోకుండా చూసుకున్నాడు. ఈ కామెడీ క్లిక్ అవ్వ‌డంతో సినిమా జ‌నాల‌కు ఎక్కేసే ఛాన్సే ఉంది. అయితే అనిల్ గ‌త చిత్రాల్లో కూడా క‌థ పెద్ద‌గా ఉండ‌ద‌న్న టాక్ అయితే మాత్రం ఉంది. ఈ విష‌యం గురించి ఇటీవ‌లె స‌రిలేరు చిత్ర ప్ర‌మోష‌న్స్ టైంలో ఓ పాత్రికేయు డు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానంగా నా చిత్రాల్లో క‌థ లేక‌పోతే సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి అని అడిగారు. 

 

ఏదో ఒక చిన్న క‌థ‌ను తీసుకుని దాని చుట్టూ కామెడీ ఎక్కువ‌గా అల్లేసి దాన్ని కామెడీ, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా మొత్తం తీసేస్తే ప్ర‌స్తుతం జ‌నాలేమీ పిచ్చోళ్ళుకారు. వాళ్ల‌కు జ‌డ్జిమెంట్ చాలా బాగా వ‌చ్చు చిర‌వ‌రికి మ‌రి అనిల్ ని ఏం చేస్తారో తెలియాలి. ఇక ఈ చిత్రానికి సంక్రాంతి సెల‌వ‌లు కాస్త క‌లిసి రావ‌డంతో ఒక‌రకంగా న‌ష్టం అయితే ఏమీ ఉండ‌ద‌నే భావిస్తున్నారు చాలా మంది. అలాగే ఏ సినిమాలోనైనా స‌రే అనిల్ ఎవ‌రో ఒక్క‌రికి మాత్ర‌మే మ్యాన‌రిజ‌మ్ పెట్టేవారు అయితే హీరోయిన్ లేదా హీరో కానీ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మాత్రం మొత్తం అంద‌రికిదాదాపుగా మ్యాన‌రిజ‌మ్స్ పెట్టిన‌ట్లు అనిపించింది. అది కాస్త మెప్పించిన‌ట్లు అనిపించ‌లేదు. మ‌రి ఈ దెబ్బ‌తో మ‌హేష్ మళ్ళీ అనిల్‌కి మ‌రో ఛాన్స్ ఇస్తాడా అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈచిత్రంలోని పాట‌లు కూడా పెద్ద‌గా జ‌నాల్లోకి రీచ్‌కాలేదు. ఈ సినిమాకు ఫ‌ర్‌ఫెక్ట్ రేటింగ్ 2.75 / 5.

మరింత సమాచారం తెలుసుకోండి: