అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో. తన సొగసులు చూపించడానికి రేపు అనగా జనవరి 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు అభిమానుల మనుసుల్లో నిండుగా నిలిచిపోయాయి. ఇకపోతే ఈ సినిమా తరువాత వరుసగా బన్నీ చేతిలో సినిమాలున్నాయని సమాచారం.

 

 

ఇదిలా ఉండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిందట. అయితే తాజాగా ఈ సినిమాలో బన్నీ రోల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. అదేమంటే బన్నీ ఒక లారీ డ్రైవర్‌ గా, చాలా రఫ్ లుక్ లో నటించబోతున్నట్లు ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో  తెలియదు.. ఇకపోతే దర్శకుడు సుకుమార్ గతంలో మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే, మూవీని అందించి చేతులు కాల్చుకున్నాడు. కానీ జూనియర్ ఎన్‌టీయార్‌తో వచ్చిన "నాన్నకు ప్రేమతో" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 

 

ఆ తర్వాత వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సుకుమార్, అయితే తాను ఎంచుకున్న కధల విధానాన్ని చూస్తే ఇవన్నీ కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు ఈ దర్శకుడు. ఇక తాజాగా ఇప్పుడు బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే సాగుతుందని సమాచారం. ఇక కధ విషయానికి వస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని వినికిడి.

 

 

దీని కారణంగా ఈ సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో, కొత్తవారు అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో  కొంతమంది కొత్త నటీనటులను ఈ సినిమా కోసం తీసుకున్నాడట సుకుమార్. ఇకపోతే ఈ సినిమా హిట్ కొట్టి హ్యట్రిక్ సాధించాలనే కసి ఈ దర్శకునిలో కనిపిస్తుందని అనుకుంటున్నారట. మరీ బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చే ఈ చిత్రం, సుకుమార్ గత రికార్డ్‌లను తుడిచేస్తుందో లేదో తెలియాలంటే కాస్త వేయిట్ చేయక తప్పదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: