అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో కొంచెం మాస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు జోకులు ఉన్నప్పటికీ మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే అనిల్ రావిపూడి ఈ కథను చాలా మంచిగా వినిపించాడు.


అయితే మొన్న ఆ మధ్య అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ' మహేష్ బాబు జోకుల సినిమాలో చేయడానికి ఎటువంటి ఆసక్తి చూపలేదు. ఎందుకంటే అతడు ఇంతకుముందే ఖలేజా సినిమాలో ఇంకా దూకుడు సినిమాలో కామెడీ చేశాడు కాబట్టి అటువంటి సినిమాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ నేను చేసే సినిమా గురించి అతను ఒక రెండు మూడు సార్లు ఆలోచించి తర్వాత ఓకే చెప్పేసాడు. అదే విధంగా మహేష్ బాబు తో సినిమా తీయడం నా సినీ చరిత్రలోనే ఒక గొప్ప విషయం అని చెప్పుకుంటున్న. ఇకపోతే, మహేష్ బాబు నన్ను సోదరుడిలా గా గౌరవించాడు. అందుకే నేను అతనితో డైరెక్షన్ చేసేటప్పుడు భయపడలేదు.' అని చెప్పుకొచ్చాడు.


ఇక రష్మిక మందాన మాట్లాడుతూ.. ' నేను నా పాత్ర గురించి ఎవరికీ చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుతానని మీకు తెలుసు కదా! కానీ ఈ ట్రైలర్ లో నా క్యారెక్టర్ చూసినప్పుడు మీకు నేను హీరో ని టార్చెర్ చేస్తూ చేస్తుంటాను. అలాగే మేకింగ్ సెట్స్ పై కూడా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటా. నా పాత్ర హాస్యభరితమైనది. నేనెప్పుడూ హాస్య భరితమైన క్యారెక్టర్ లో యాక్ట్ చేయలేదు కాకపోతే నేను ఈ సినిమా ద్వారా ట్రై చేసి అసలు నా బలాలు బలహీనతలు ఏంటి అనేది తెలుసుకో పోతున్నాను. మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటారు అదే విధంగా చాలా కామ్ గా ఉంటారు. నా పక్కన ఉన్నప్పుడు అలా ఉండకూడదు ఎందుకంటే నేను చాలా అల్లరి చేస్తా కదా.' అంటూ చెప్పుకొచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంకి ఐదువేల ప్రేక్షకుల నుంచి దాదాపుగా అన్ని 4 రేటింగ్స్ ఏ వచ్చాయి. సో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పకనే చెబుతుంది. సరిలేరు నీకెవ్వరు మూవీ ఫుల్ రివ్యూ అప్డేట్ కోసం Stay tuned.

మరింత సమాచారం తెలుసుకోండి: