మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమా ఈ రోజు ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఎంతో పాజిటివ్ బజ్ తో పందగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో.. సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు క్యారెక్టర్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదే విజయశాంతి, ప్రకాష్ రాజ్..

 

ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించాడు. టీజర్ లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఎంతలా హిట్ అయ్యిందో తెలిసిందే. అలాగే ట్రైలర్ లోనూ ప్రకాష్ రాజ్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మరో లెవెల్ లో ఉంటుందని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గెటప్ కూడా ఈ సినిమాలో చాలా ప్రెష్ గా ఉంది. 

 

విలనిజానికి తగినట్లుగా ఆ గెటప్ ని తీర్చి దిద్దారు. చూస్తే విలన్ అనిపించేలా ఉంది. ఇక సినిమాలో   క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ప్రకాష్ చెప్పే డైలాగులు సైతం ప్రేక్షకులని అలరిస్తాయి. ప్రకాష్ రాజ్ డైలాగులకి మహేష్ ఇచ్చే కౌంటర్లు మరింత బాగా పేలాయి. మొత్తానికి ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ సరిగ్గా సరిపోయాడు. చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ మంచి పాత్రలో కనిపించారని డెఫినెట్ గా ఫీల్ అవుతాం..

 

ఈ మధ్య సినిమాల్లో విలన్లు తగ్గిపోతున్నారు. ఆ కొరతని సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా తీర్చేశాడు అనిల్ రావిపూడి. ఇక విజయశాంతి రోల్ కూడా చెప్పుకోదగ్గదే. సరిలేరు నీకెవ్వరు సినిమాని అనిల్ సుంకర నిర్మించగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: