ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి... సక్సెస్ఫుల్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ళ తరవాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండడం కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీని బాగా దట్టించాడు. అంతేకాకుండా సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఎంతో యాక్టివ్ గా దూకుడుగా కనిపించారు. ఇక ఈ సినిమాపై భిన్నమైన టాక్ వినిపిస్తుంది. కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేస్తే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అబ్బే ఏదో మిస్ అయిందే  అనిపిస్తుంది. 

 

 

 

 అయితే ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త కామెడీ డోస్  ఎక్కువ పెంచేసాడు. ఏదైనా కాస్త డోస్ పెంచితే  వికటిస్తుంది కదా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ విషయం కూడా అలాగే మారిపోయింది. కామెడీ డోస్  బాగా పెంచేయడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ. సినిమా మొత్తం కామెడీ సీన్లతో నే ముందుకు తీసుకెళ్ళాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అదరగొట్టినప్పటికీ అనిల్ రావిపూడి టేకింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కొన్ని  కామెడీ సీన్లు బోరింగ్ గా అనిపిస్తుంటాయి. సినిమా మొత్తం కామెడీ సీన్లు ఉంటే అక్కడక్కడా మాత్రమే కామెడీ పేలింది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

 

 

 

 బోరు సీన్ల  మధ్య అప్పుడప్పుడూ కొన్ని మంచి కామెడీ సీన్లు అన్నట్టుగా కథాకథనాలు ముందుకు సాగి పోతూ ఉంటాయి. చాలా సింపుల్ లైన్ తో  కథ రాసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి... తనదైన కామెడీని  ఈ సినిమాలో దట్టించేందుకు  ప్రయత్నాలు చేసినప్పటికీ అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇక ఎంతో హైప్ తో  నిర్మాత బండ్ల గణేష్ ను కమీడియన్ గా మార్చేసి  సినిమా లోకి తీసుకొచ్చినప్పటికి కూడా అంతలా వర్కౌట్ కాలేకపోయింది. ఈ సినిమాలో బండ్ల గణేష్ కామెడీ ఇరగదీస్తారు  అని అందరూ అనుకుంటే... బండ్ల గణేష్ కామెడీ మాత్రం తుస్సుమంది. ఇక ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ట్రైన్ అండ్ బండ్ల గణేష్ ఎపిసోడ్ ప్రేక్షకులను అంతగా నవ్వించ లేకపోయింది. క్లైమాక్స్ విషయంలో కూడా అనిల్ రావిపూడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలేదు  అర్థమవుతుంది. అన్ని సినిమాల్లో  అందంగా కనిపించే రష్మిక మందన్న ఈ సినిమాలో ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదు . ఇక రష్మిక పాత్ర కూడా బోరింగ్ గానే  సాగిపోతూ ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా బోరు సుత్తి సీన్ల  మధ్య కొన్ని మంచి కామెడీ సీన్లు వరకే పరిమితం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: