అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ అభిప్రాయాలను పొందుతుంది. అయితే ఈ సినిమా చూసిన నెటిజన్లు ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. 



సరిలేరు నీకెవ్వరు సెకండాఫ్ బాగా ఆరంభమవుతుంది కానీ క్లైమాక్స్ మాత్రం అసలు బాగోలేదు. అదేవిధంగా అనిల్ రావిపూడి మహేష్ బాబు స్టార్డమ్ కి తగినట్లుగా సినిమా తీయలేకపోయాడు. అనిల్ రావిపూడి సినీ కెరీర్లో చాలా దరిద్రమైన సినిమా సరిలేరు నీకెవ్వరు అని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా ఒక్కసారి మాత్రమే చూడగలిగిన సినిమా ఇది. ఒక మైండ్ బ్లాక్ సాంగ్ తప్ప మిగతా సినిమా మొత్తం చాలా బోరింగ్ గా ఉండటంతో ఆడియన్స్ అంతా నిద్రపోయారు. నేనైతే చాలా నిరాశ చెందాను.


ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ... సరిలేరు నీకెవ్వరు చిత్రం ఇప్పుడే చూశాను. ఒక ట్రైన్ సీన్ తప్పా సినిమాలో ఏమీ లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు వాయిస్ చాలా చండాలంగా ఉంది. రెండు ఫైట్ లు తప్పా మిగతాదంతా సొల్లు కామెడీ అసలు దీన్ని కామెడీ అంటారా అనేలా ఈ సినిమా ఉంది' అంటూ చెప్పాడు.


'సినిమా చూసాక ప్రతీ ఒక్క MB ఫ్యాన్ అనుకునే మాట 100% Fact. సుకుమార్ గారు మహేష్ బాబూ గారి కోసం కథ రాస్తే దాన్ని రిజెక్ట్ చేసి అల్లరినరేష్ కి సెట్ అయ్యే కామెడీ సినిమాకి ok చెప్పాడు', అని నెటిజన్లుు అభిప్రాయపడ్డాడు.

https://mobile.twitter.com/CultSSMBFan_/status/1215845187999522817

ఇకపోతే, సినిమా మొత్తం ఒకసారి కంటే ఎక్కువ చూడలేమని కేవలం మామూలు సినిమా అని, మహేష్ బాబు నుంచి ఇటువంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదని ప్రజల నుంచి టాక్ వినిపిస్తుంది. కొంతమంది మాత్రం సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ మాత్రం చాలా చండాలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: