స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హీరోయిన్ పూజా హెగ్దె కలిసి రెండు సినిమాల్లో నటించింది. దువ్వాడ జగన్నాథం సినిమాతో పూజా హెగ్దెకి తెలుగులో మంచి హిట్ ఇచ్చాడు బన్ని. డిజేకి ముందు డిజే తర్వాత పూజా హెగ్దె కెరియర్ ఎలా మారిందో అందరికి తెలిసిందే. ఇక అప్పటి నుండి అమ్మడు వరుస స్టార్ సినిమాలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా మళ్లీ ఈ జోడీ అల వైకుంఠపురములో సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి.   

 

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. త్రివిక్రం బన్ని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీగా అల వైకుంఠపురములో సినిమా భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో అల్లు అర్జున్, పూజా హెగ్దెల మధ్య కొన్ని సీక్రెట్ ఫోటోస్ ఉన్నాయట. అల్లు అర్జున్ తో ఆల్రెడీ ఒక హిట్ అందుకున్న పూజా హెగ్దె అతనితో షూటింగ్ టైంలో చాలా ఫోటోలు దిగిందట. అప్పుడెప్పుడో ఈఫిల్ టవర్ ముందు వీరిద్దరు స్టిల్ ఇచ్చారు కదా అలాంటి ఫోటోలు అన్నమాట.

 

అలాంటివి తన దగ్గర చాలా ఉన్నాయని త్వరలోనే అవి బయట పెడతానని ఊరిస్తుంది అమ్మడు పూజా హెగ్దె. అల వైకుంఠపురములో సినిమా కూడా హిట్టు పడితే పూజా హెగ్దె మరింత రెచ్చిపోవడం ఖాయం. ఇప్పటికే వరుస స్టార్ సినిమాలతో హంగామా సృష్టిస్తున్న పూజా హెగ్దె ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: