ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ ని సందర్శించిందని అందరికీ తెలుసు. అయితే, మంగళవారం రోజు క్యాంపస్ కు వెళ్ళిన దీపికా పదుకొనే సాయంత్రం 7 గంటల 30 నిమిషాల నుంచి పావుగంట సేపు అక్కడే గడిపారు. ఆదివారం జరిగినటువంటి దాడిలో జేఎన్.యు అధ్యక్షురాలు ఆయుషి తో సహా మరి కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే, నల్ల దుస్తుల్లో వచ్చిన హీరోయిన్ దీపికా పదుకునే వారితో కొద్దిసేపు పాటు మాట్లాడి వారిని పరామర్శించింది.

 

అయితే జె ఎన్ యు విద్యార్థుల నిరసన కు మద్దతు తెలిపిన దీపికా పడుకొనే ని చాలామంది స్వాగతించగా.. మరికొంతమంది మాత్రం ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ తీవ్రంగా విమర్శించే వ్యక్తుల జాబితాలోకి తాజాగా స్మృతి ఇరానీ ఎక్కింది.


చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ని ఉద్దేశిస్తూ... 'ఒక సీఆర్పీఎఫ్ జవాను చనిపోతే పండగ చేసుకునేటటువంటి వారికి నువ్వు మద్దతు పలుకుతున్నావు. అది నీకు కూడా తెలుసు. భారతదేశ విచ్చిన్నం కోసం ఆమె వీళ్ళతో సంఘీభావం తెలుపుతుందని అందరూ ఊహించారు. భారత్ ముక్కలు ముక్కలు కావాలని అనేటటువంటి వారికి మద్దతు ఇవ్వటం అనేది ఆమె హక్కు. ఎవరైతే ఆడవాళ్ళ పై దాడి చేసే వారికి మద్దతు ఇస్తారో వారి హక్కును నేను తిరస్కరించలేను. దీపికా పదుకొనే రాజకీయ అనుబంధం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను.'

 

'ఆమె నిరసనకారులతో ఎందుకు నిలబడుతుందో వార్తలు చదివిన ఎవరికైనా తెలుస్తుంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని 2011 లో తన రాజకీయ అనుబంధాన్ని తెలియజేశారు. ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, అది వారికి తెలియదు కాబట్టి. ఆమె స్థానాన్ని కనుగొన్న ఆమె యొక్క ఆరాధకులు చాలా మంది ఉన్నారు.' అని అన్నారు. అలాగే ఇంతకుముందు దీపికా నటించినటువంటి చపక్ మూవీని బహిష్కరించాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: