సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు'. నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆడియో స్లోపాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఈ సినిమా ప్రారంభంలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికి మాస్-క్లాస్ కి కావాల్సిన బీట్స్ ని బ్యాలెన్సింగ్ గా ఇవ్వడంలో కొంతవరకు సక్సస్ అయ్యాడు. కానీ సినిమాకి మాత్రం పెద్ద ఎస్సెట్ గా నిలవలేకపోయాడు. కాకాపోతే హీ ఈజ్ సోక్యూట్...మైండ్ బ్లాంక్ అనే రెండు పాటలకు ఆడియన్స్ నుంచి కాస్త మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నేడు సినిమా విడుదలైన నేపథ్యంలో మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్-రష్మిక మాస్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారట. ఈ పాట అంచనాలను మించి ఫ్యాన్స్ ని మురిపిస్తోందట.

 

మొత్తం పాటలన్నింటిలోకీ మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ మాస్ ఫ్యాన్స్ కి విజువల్ గాను మంచి ట్రీట్ ఇస్తోందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మహేష్ తో ఎగ్రెసివ్ గాళ్ రష్మిక సరసాలు పాటలో హైలైట్ గా నిలిచాయని అందుకు మంచి ఫీడ్ బ్యాక్ అందుతోందని అంటున్నారు. రష్మిక స్కిన్ షో ఫ్యాన్స్ కి డబుల్ కిక్ నిస్తోంది. అమంతేకాదు ఈ కన్నడ పొట్టి పిల్ల స్టెప్పులు గట్టిగానే వేస్తోందని ప్రశంసలందుకుంటోంది. ఇక మహేష్ కంటే రష్మికకే ఈ పాటతో మంచి గుర్తింపు దక్కుతుందని ఓ తెగ పొగిడేస్తున్నారు కొందరైతే. గతంలో ఈ బ్యూటి విజయ్ దేవరకొండతో చేసిన లిప్ లాక్ లకు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. ఈ పాట సోషల్ మీడియా సహా మాస్ ఆడియన్స్ లోనూ ట్రెండింగ్ గా నిలుస్తోంది.

 

ఇక ఇప్పటికే ఈ సినిమా రివ్యూలు వెబ్ ని ముంచెత్తుతున్నాయి. మహేష్ చెప్పినట్లే మొదటిరోజు బొమ్మ థియేటర్లో దద్దరిల్లుతోందట. హైప్ కి తగ్గట్టే సినిమాలో మ్యాటర్ ఉందని ఫ్యాన్స్ అంటుంటే అంతలేదని కొంతమంది రివర్స్ లో అంటున్నారు. అంతేకాదు అంత పొగిడేంతగా రష్మిక డాన్స్ ఏమీ లేదని ఏవో కప్ప గంతులు కుప్పిగంతులు మాదిరిగా ఉన్నాయని కాస్త ఓవర్ యాక్షన్ కూడా చేసిందని అంటున్నారు. మొత్తానికి రష్మిక కి అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మరి ఇది సినిమాకి హెల్ప్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: