‘భారీ అంచనాలతోనే మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్స్‌కి రండి..అనీల్ రావిపూడి ఈ సినిమా ఆ అంచనాలను పక్కాగా అందుకునేట్టుగానే  ఉంటుంది’ అని విడుదలకు ముందు  చేసిన ప్రామిస్‌ను ఈ చిత్రంతో నిలబెట్టుకున్నాడు. ఆయన ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ మార్క్ మిస్ కాకుండా ఒక బలమైన నేపథ్యాన్ని ఎన్నుకుని బలమైన సన్నివేశాలు, ఆ సన్నివేశాలకు జీవం పోసే పాత్రలతో సాలిడ్ డ్రామాగా నడిపించారు.

 

అందరూ కోరుకునే ఫన్, ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, సొసైటీ‌లోని లూప్ హోల్స్, .. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇలా అన్నీ మేళవించి సంక్రాంతి పిండివంటలతో భోజనం ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా కనువిందుగా  మలిచారు.  ఫస్టాప్‌ను  ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో ఫన్‌ని మిక్స్ చేసిచాలా ఆసక్తికరంగా మలిచిన దర్శకుడు.. స్వతహాగా రైటర్ కావడంతో తన పెన్ పవర్ చూపించారు.  లెంగ్తీ డైలాగ్‌లు మహేష్ బాబుతో చెప్పించి విజిల్ వేయించేలా చేశారు. క్లైమాక్స్ కూడా విలన్‌ని చితకబాది బుద్ది చెప్పే రొటీన్ ఎండింగ్ కాకుండా.. థ్రిల్లింగ్‌తో కూడిన ఎమోషన్‌కి దేశభక్తి అనే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.


‘మహేష్ బాబు ఈ చిత్రంపై నా కెరియర్‌లో నేను తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్ ఈ టైంలో ఈ సినిమా చేయడం’ అని సినిమా విడుదలకు ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు  .. తనలోని కొత్త నటుడ్ని ఈ చిత్రం ద్వారా  చూపించారు. ‘నా నుండి మంచి మాస్ సినిమా రావడంలేదనే కంప్లైంట్ ఫ్యాన్స్ నుండి ఉంది.. ఈ సినిమాతో అది తీర్చేస్తా’ అని చెప్పిన మహేష్ ఈ సినిమాతో మాస్ అండ్ క్లాస్‌ మిక్స్ చేసి వారి కలను నెరవేర్చారు.

 

 మహేష్ డైలాగ్ డెలివరీ.. ఆయన లుక్, యాక్షన్ సీన్స్.. వీటన్నింటికీ మించి డాన్స్‌తోనే ఇరగదీశారు మహేష్. మైండ్ బ్లాక్ సాంగ్‌లో నిజంగానే డాన్స్‌తో మైండ్ బ్లాక్ చేశారు. ఈ చిత్రంలో మరీ స్మార్ట్‌గా మహేష్ కనిపించి.. ఆయన వయసు వెనక్కిగాని వెళ్తుందా అన్నట్టుగా మెస్మరైజ్ చేశారు. కాశ్మీర్ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి పిల్లల్ని కాపాడే సీన్.. కర్నూల్ కొండారెడ్డి బురుజు ఫైట్.. నల్లమల ఫారెస్ట్‌లో చెట్ల వేర్లతో ఫైట్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి.ఓవరాల్‌గా..  'నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మహేష్ బాబు బొమ్మ దద్దరిల్లింది’.

మరింత సమాచారం తెలుసుకోండి: