సంక్రాంతి పోటీలో ఉన్న మ‌రో సినిమా `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం ఈ రోజు విడుద‌లైంది. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే క‌లిసి జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ఈ చిత్రం పై బ‌న్నీ ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా సినీ ప్రేక్ష‌కులు కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం కూడా అనిల్ రావిపూడి తీసిన స‌రిలేరు చిత్రంలో కూడా పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్యూ అన‌వ‌స‌ర‌మైన కామెడీ ఎక్కువ‌గా పెట్టేశారు కానీ క‌థ మాత్రం లేదు. ఇప్పుడు బ‌న్నీ సినిమాలో కూడా క‌థ క‌నిపించ‌డంలేదు. అంటే వీళ్ల‌కు క‌థ అక్క‌ర్లేదు.. వీక్ క‌థ‌ల‌తో సినిమాలు తీసేశారు. ఇక అల విష‌యానికి వ‌స్తే క్లాస్ గా సాగే హ్యాపీ ఫామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారు. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేశార‌ని చెప్పాలి.

 

ఏదో నార్మ‌ల్ ఆడియ‌న్స్ కి ప‌ర్వాలేద‌నిపించేలా చేశారు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు. వీళ్ళు క‌థకు ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా ఏదో ఒక చిన్న మ్యాజిక్ చేసి సినిమాని తోసేస్తున్నారు. ఇది ఎంతవ‌ర‌కు న్యాయం అన్న‌ది కొన్ని చిత్రాలు చూస్తుంటే అర్ధం కావ‌డంలేదు. ఒక‌ప్పుడు సినిమాల్లో కామెడీ అనేది స‌మ‌పాళ్ళ‌లో ఉండేది. ఇప్పుడు అలాకాదు అర్ధంప‌ర్ధం లేని కామెడీతో జ‌నాలో న‌వ్వాలో లేదో కూడా తెలియ‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌ని ఏర్పాటు చేస్తున్నారు. చెప్పిన డైలాగ్‌నే మ‌ళ్ళీ మ‌ళ్ళీ చెప్పించి కాస్త బోర్ కూడా కొట్టిస్తున్నారు. ఒక డైలాగ్‌ని అన్నిసార్లు  చెప్పినా న‌వ్వురాద‌న్న విష‌యం తెలియ‌డంలేదో మ‌రేమో. ఇంత‌కీ వీళ్ళ‌కి మంచి క‌థ‌లు దొర‌క‌డం లేదా లేక అస‌లు వీళ్ళ‌కు తెలిసిన క‌థ‌లు ఇంత‌వ‌ర‌కేనా.. దానికి తోడు పెద్ద కాస్ట్ అండ్ క్రూతో సినిమాకి మంచి ప‌బ్లిసిటీని ఇచ్చేస్తూ ఒక బ‌జ్ తీసుకువ‌చ్చేస్తున్నారు. అస‌లే త్రివిక్ర‌మ్‌కి కాపీ క్యాట్ అనే పేరుంది. దానికి క‌థ‌లో ఇంట్ర‌స్టింగ్ లేక‌పోతే ఇక ఎవ‌రు చూస్తున్నారు. ఎంత పంచ్‌డైలాగ్‌లు కామెడీ పెట్టి ఎమోష‌న్స్‌తో లాగించేద్దామంటే అది ఎన్ని రోజులు వ‌ర్క్అవుట్ అవుద్దో వారికే తెలియాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: