స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. త్రివిక్రమ్, బ‌న్నీ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో టబు, జయరామ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్‌ హిట్ కావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఇక బన్నీ మహేష్ తో జనవరి 11నే వచ్చేసాడు అది USA లో ప్రీమియర్ షోలు ఆల్రెడీ వేసాడు. మ‌రియు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియ‌ర్ షోలు మొద‌ల‌య్యాయి. అయితే త్రివిక్రమ్ మరోసారి తను బాగా స్ట్రాంగ్ అయిన ఎమోషనల్ కామెడీ పంథాలో చేసిన సినిమానే ‘అల వైకుంఠపురములో’. అల్లు ర్జున్ పెర్ఫార్మన్స్, త్రివిక్రమ్ మార్క్ కామెడీ అండ్ ఎమోషన్, అలాగే క్లాసికల్ పిక్చరైజేషన్ అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ సినిమాకి స్పెషల్ హైలైట్స్. కామెడీ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా లేకపోవడం వల్ల‌ కాస్త స్లో అనిపిస్తుంది. 

 

కానీ అసలు కథ, మేజర్ ఎలిమెంట్స్, యాక్షన్ అండ్ ఎమోషన్స్ అన్ని కలిపి సెకండాఫ్ ని ఆసక్తికరంగా నడిపించాడు. సో సినిమా అయ్యేటప్పటికి పెదవుల మీద నవ్వులతో, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తాం. ఓవ‌ర్ ఆల్‌గా చూస్తే.. సినిమా ఫ‌స్టాఫ్ మొత్తం కామెడీ ఎంటర్ టైనర్‌తో న‌డిస్తే.. సెకండాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో క‌న్నీళ్లు పెట్టిస్తుంది. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా పడుతుంది. బి,సి సెంటర్లు ఆశించే మసాలా పెద్దగా లేకపోవటంతో అక్కడ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు.  మ‌రి భారీ అంచ‌నాల న‌డుమ విడద‌లైన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో ఎంత వ‌ర‌కు నెగ్గుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: