అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే  బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడి అయింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ సినిమా కోసం భారీ అంచ‌నాల‌తో అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

ఇక తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్‌ షోలకు పర్మిషన్‌ రావటంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే బన్నీ సందడి మొదలవ్వనుంది. ఇక ఓవర్‌సీన్‌లో మరో 12 గంటలు ముందుగానే ప్రీమియర్స్‌ షో పడనున్నాయి. సినిమా విష‌యానికి వ‌స్తే.. బన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. జాబ్ కోసం ట్రై చేసి ఓ పెద్ద కంపెనీలో జాయిన్ అవుతాడు. ఓనర్ అయిన పూజ హెగ్డే కి అసిస్టెంట్. అయితే ఆత్మాభిమానంకు, మంచి కి చాలా విలువ ఇస్తుంటాడు. ఆస్తులు కంటే విలువైనంది బంధాలు అని భావిస్తుంటాడు. ఇది నచ్చిన పూజ హెగ్డే బన్నీతో లవ్ లో పడుతుంది. సినిమా మొత్తం కూడ చాలా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. 

 

అయితే బన్నీ, మురళి శర్మ మధ్య వచ్చే కామెడీ సినిమాకు చాలా హైలైట్. ఇక సెకండాప్ లో అసలు బన్నీ ఎవరు అనేది ట్విస్ట్ ఉంటుంది. వాస్త‌వానికి చెప్పాలంటే.. క‌థ లేదు.. హీరో క్యారెక్ట‌ర్ ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి ఫ్యామిలీకి చెందిన వాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో కూడా క్యారెక్ట‌ర్లు బాగా రాసుకున్నాడు. కాని.. క‌థ‌, క‌థ‌నాలు ప‌ట్టించుకోడు. ఈ సినిమాలో కూడా కొన్ని క్యారెక్ట‌ర్లు బాగా రాసుకుని వాటిని చూపించేస్తాడు. అంత వ‌ర‌కు ఓకే .. అస‌లు క‌థ‌, క‌థ‌నాల్లో మాత్రం తేలిపోతాడు. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేశార‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: