సినిమావాళ్ళంటేనే సెంటిమెంట్స్‌. సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి అది పూర్త‌యి గుమ్మ‌డికాయ కొట్టేవ‌ర‌కు సెంటిమెంట్‌ని ఫాలోఅవుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి ఈ సెంటిమెంట్‌కి బ్రేక్ వేశారు. తెలుగు పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్స్ ను త్రివిక్రమ్ మరియు బన్నీ `అల‌వైకుంఠ‌పురంలో` చిత్రం ద్వారా బ్రేక్ వేశారు. ఇది వరకు పవన్ తో తీసిన మూడు చిత్రాల్లో మూడోది అందులోను జనవరిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి అదే గతి పడుతుంది అనుకున్న వారికి త్రివిక్రమ్ మరియు బన్నీలు చాచి పెట్టి గూబ మీద కొట్టేలా చేశారని చెప్పాలి, గ‌తంలో విడుద‌లైన చిత్రాలు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `జ‌ల్సా`, `అత్తారింటికి దారేది`పెద్ద‌ హిట్ లు కొట్టాయి.  మూడోద `అజ్ఞాత‌వాసి` ప్లాప్ ఇప్పుడు బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబో మూడోది అది కూడా జ‌న‌వ‌రిలో రావ‌డంతో డౌట్ ప‌డిన వాళ్ల‌కు ఈ సినిమా హిట్‌తో బ్యాడ్‌సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు. మ‌రి ఇది ఈ సంక్రాంతికి మంచి హిట్ కొడితే ఆ సెంటిమెంట్‌కి బ్రేక్ ప‌డిపోయిన‌ట్లే. 

 

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మ‌న్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరాయి. మ‌రి ఇది ఆడియోతో పాటు సినిమా కూడా మంచి హిట్ కొడితే ఈ సంక్రాంతి పందాల్లో మొద‌టి విజేత‌గా నిలుస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న ఈ సినిమా నార్మ‌ల్ ఆడియ‌న్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌నే చెప్పాలి. అందులోనూ పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ఈ చిత్రం మ‌రింత హైప్ అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు క‌థ ఎలా ఉన్నా సాంగ్స్ కోసం కూడా కొంత‌మంది సినిమాని చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. అందులో ఈ చిత్రానికి ఏమాత్రం ఢోకా లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: