టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి పాటలు టీజర్ లు ఇప్పటికే విడుదలై సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్ని వర్గాల అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక నేడు భార అంచ‌నాల న‌డుమ సంక్రాంతి కానుక ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

 

విడుద‌ల‌కు ముందే ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌డంతో ఈ చిత్రానికి  పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని.. ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్‌లు త్రివిక్రమ్ సాగదీసినట్లు అనిపించినా.. పూర్తి ఫీల్‌తో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. సెకండాఫ్‌లో విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని కొడుకు పైడిత‌ల్లితో జ‌రిగే మీటింగ్‌లో హీరోల సాంగ్స్‌కు బ‌న్నీ డ్యాన్సులు వేస్తాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలోని ఐ వాన ఫాలో పాట‌కు ఎన్టీఆర్ స్టైల్లోనే డ్యాన్సులు వేస్తాడు. 

 

అలాగే ఉండిపోరాదే సాంగ్‌తో పాటు త‌న రేసుగుర్రంలోని సినిమా చూపిస్త‌మావ పాట‌కు కూడా డ్యాన్స్ వేస్తాడు. ఇక సునీల్ మా ప‌వ‌న్ సినిమా పాటేసుకు మంటాడు. ఎవ‌రి డ‌ప్పు వాడు కొట్టండెహే అన్న పాట‌కు డ్యాన్స్ వేస్తాడు. పిల్లా నువ్వులేని జీవితం పాట‌కు త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొడ‌తాడు. ఏదేమైనా ఎన్టీఆర్ సాంగ్‌కు బ‌న్నీ డ్యాన్సులు వేయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఫ‌స్ట్ టైమ్ సంక్రాంతి బ‌రిలో దిగిన అల్లు అర్జున్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: