త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ లో కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, ప్రస్తుతం వీరి హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పడడం జరిగింది. అయితే అది మాత్రమే కాక, ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అత్యద్భుత రెస్పాన్స్ ని అందుకోవడంతో ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా తారా స్థాయికి పెరిగాయి అనే చెప్పాలి. 

 

ఇక ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా మంచి టాక్ ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్‌, బ‌న్నీ ఎక్కువ గ్యాప్ తీసుకున్నా అది సరిగ్గా పూడ్చేసారని అంటున్నారు. ఎక్కడ ఏం పెట్టాలో అలా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ అలాగే డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, త్రివిక్రమ్ ఎంచుకున్న థీమ్ లైన్ ఇది వరకే ఉన్నదే తీసుకోవడం కాస్త నిరాశ కలిగించే అంశం అని చెప్తున్నారు. అయితే ఇది కూడా పెద్ద మైనస్ కూడా అని చెప్పలేమట. మొత్తంగా మాత్రం త్రివిక్రమ్ మరియు బన్నీల కెరీర్ లో ది బెస్ట్ చిత్రం ఇది అని చెప్పాలని అంటున్న వారు కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయట. 

 

ఇక స్క్రీన్ పై బన్నీ, పూజల జోడి బాగుందని, సాంగ్స్ లో అయితే ఇద్దరూ ఎంతో అందంగా కనపడ్డారని అంటున్నారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ సమపాళ్లలో జోడించిన ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంత సాగతీత సీన్స్ అంతగా ఆకట్టుకోవని చెప్తున్నారు. ఇక ఎంతో హృద్యంగా సాగె ఎమోషనల్ క్లైమాక్స్ అయితే అందరి హృదయాలు తాకుతుందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ అలవైకుంఠపురములో సినిమా, బన్నీ త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన గత రెండు సినిమాల మాదిరి సక్సెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి ......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: