సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నిన్న రిలీజైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి అభిమానుల నుండి మరియు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించింది. మంచి మాస్ మసాలా ఎంటర్ టైనర్ అంటూ సినిమాని పొగిడేస్తున్నారు. సినిమాలో మహేష్ పర్ ఫార్మెన్స్ తో పాటు, ఫైట్ సీన్లకి, మరియు డాన్సులకి ఫిధా అయిపోతున్నారు. అలాగే మహేష్ చెప్పే డైలాగులు సైతం బాగా పేలాయి.

 

మొత్తానికి మాస్ సినిమా కనిపిస్తూ కంప్లీట్ మీల్స్ లా ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ లోనూ మహేష్ సినిమా అదరగొడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా భీభత్సం సృష్టించింది.

 

యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా మహేష్ ఓ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 1 మిలియన్ వసూళ్లను దాటి వేసింది. కేవలం ఒక్క రోజులోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద వన్ మిలియన్ సాధించిన హీరోగా నిలిచాడు. సౌత్ ఇండియా లోనే పది సార్లు వన్ మిలియన్ సాధించిన హీరోలు లేరు. 

 

యూఎస్ మార్కెట్ లో బారి డిమాండ్ కలిగిన మహేష్ ఆ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆయన సినిమాలకి యుఎస్ లో భారీ ఓపెనింగ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ ఈ స్థాయిలో ఉండటం మాత్రం నిజంగా సినిమాకి చాలా కలిసొచ్చే అంశం. ఇంకా ఇలానే కొనసాగితే సినిమా నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టే దిశగా వెళ్ళడం ఖాయం అనిపిస్తోంది. మరి ఏం జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: