ఒక్కో ద‌ర్శ‌కుడిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. త్రివిక్ర‌మ్‌కి మాట‌ల మాంత్రికుడు అనే పేరు  ఉంది. అది ఎందుక‌ని అంటే.. ఆయ‌న రాసుకునే డైలాగులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ రోజే ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` విడుద‌లైంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులోని డైలాగ్‌ల‌న్నీ సూప‌ర్‌హిట్ అనే చెప్పాలి. 

 

డ‌బ్బున్నోళ్లంతా తెలివితేట‌లు ఉన్న‌వారు అనుకోవ‌డానికి లేదు. వాళ్లు అదృష్ట‌వంతులు అంతే... సినిమాలో ఉన్న ఈ డైలాగ్ చాలా హైలెట్ అయింది.  ఇలాంటి అంద‌మైన‌, ప్రాస‌పూర్వ‌క‌మైన సంభాష‌ణ‌లు సినిమాలో బాగానే ఉన్నాయి. కానీ గ‌త త్రివిక్ర‌మ్ చిత్రాల‌తో పోల్చుకుంటే త‌క్కువ‌నే చెప్పాలి. సినిమా మొత్తంలో  ఎంత‌వ‌ర‌కు అవ‌స‌ర‌మో అంత‌వ‌ర‌కే ఉన్నాయి. మొద‌టిసారి త్రివిక్ర‌మ్‌లోని ద‌ర్శ‌కుడు, అత‌డిలోని ర‌చ‌యితను అదుపులో పెట్టాడ‌నిపించింది. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. రాయ‌డంలో ఎక్క‌డ త‌గ్గాలో కూడా తెలిసినోడే మంచి ద‌ర్శ‌కుడు అవుతాడు. 

 

చాలాసార్లు అత‌డి సినిమాల్లో మాట‌లు డామినేట్ అవ్వ‌డం మైన‌స్ అయ్యింది. అయితే ఈ సారి అలా జ‌ర‌గ‌కుండా చూసుకున్నాడు.  ఈ చిత్రంలో డైలాగ్‌లు ఎక్కువ‌గా వాడ‌కుండా క‌థ క‌థానాల‌కు కూడా ప్రాధాన్య‌తనిస్తూ చాలా జాగ్ర‌త్త‌గా క‌థ‌ను డీల్ చేసిన‌ట్లు అనిపించింది. ఆయ‌న గ‌త చిత్రాలు.. అర‌వింద‌స‌మేత‌, అత్తారింటికి దారేది ఈ చిత్రాల్లో పంచ్‌డైలాగ్‌ల‌తో త్రివిక్ర‌మ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. అత్తారింటికి దారేది చిత్రం ప‌క్క‌న పెడితే.. అర‌వింద‌స‌మేత చిత్రంలో పంచ్ డైల‌గులు త‌ప్పించి సినిమా క‌థ క‌థ‌నాలు పెద్ద‌గా అనిపించ‌లేదు. ఆ చిత్రం కేవ‌లం ఎన్టీఆర్ క్రేజ్ వ‌ల్లే ఆడింద‌ని చెప్పాలి.  ప్ర‌తి ఒక్క క్యారెక్ట‌ర్‌కి మంచి స్కోప్‌నిస్తూ చిత్రాన్ని బాగా  తెర‌కకెక్కించారు. త్రివిక్ర‌మ్ చిత్రాలంటేనే ఎమోష‌న‌ల్ సీన్న్ ఎక్కువ‌గా ఉంటాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. త‌మ‌న్ అందించిన ఆడియో సూప‌ర్ హిట్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: