టాలీవుడ్ - డ్రగ్స్ కేసులు ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఎక్కువ . ఆ మధ్య ఒక రేంజ్ లో డ్రగ్స్ కేసు గురించి మీడియా లో హడావిడి జరిగిన సంగతి తెలిసిందే .  డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ డ్రగ్స్ కేసు కి సంబంధించి ఎలాంటి ఫోరెన్సిక్ నివేదిక కోర్టు కి చేరలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ళ క్రితం మీడియా లో ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి హడావిడి జరగడం , పోలీసులు కూడా చాలామంది సెలబ్రిటీ లని విచారణకి రమ్మని కోరడం మనం చూశాం

 

 

. అయితే ఒక్కసారిగా ఈ కేసు లో ప్రముఖులకి క్లీన్ చీట్ లభించింది అంటూ వార్తలు వచ్చాయి. .  ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం కోరిన ఎక్సైజ్ శాఖ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని గతంలో సీఎస్‌కు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. డ్రగ్స్ కేసు లో క్లీన్ చీట్ ఇవ్వడం ఎలా జరిగింది , దీని వెనక కారణాలు ఏంటి అని చాలామంది ఆరా తీసే ప్రయత్నం చేశారు అయితే దానికి వాటిలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండించారు.

 

 

మేం ఎవరికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. అయితే అది ఇంకా నడుస్తోంది అనే అర్ధం చేసుకోవాలి కాబోలు. ఒకప్పుడు ప్రముఖులని అరస్ట్ కూడా చేస్తున్నారు అంటూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి నానా యాగీ జరిగింది . పోలీసులు విచారించిన వారిలో ప్రముఖ డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆఖరికి రీసెంట్ గా వారందరికీ క్లీన్ చీట్ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: