పడిపోతున్న తెలుగు సినిమా విలువలకే తన కలాన్ని ఆసరాగా అందించి నిలబెట్టిన టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కలానికి పదునున్నోడు ఎప్పటికీ పడిపోడు అని త్రివిక్రమ్ మరోసారి రుజువు చేశాడు అజ్ఞాతవాసి సినిమా తర్వాత అతని పై మరియు అతని సత్తాపై ఎన్నో విమర్శలు మరియు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ అల వైకుంఠపురం తో తానంటే ఏంటో అందరికీ నిరూపించాడు. కథ, డైలాగులు, దర్శకత్వం అన్నింటిలో తనదైన మార్కు చూపిస్తూ మళ్లీ పాత్ర విక్రమ్ ని సినిమాతో అందరికీ గుర్తు చేశాడు.


అసలు అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కోలుకోవడం ఏ డైరెక్టర్ కు అయినా చాలా కష్టమైన విషయం. అదీ ఇప్పుడున్న జనరేషన్ ముందు విలువలు అంటూ తిరిగితే ఎవరి దగ్గరకు రానివ్వరు. కానీ అక్కడ ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎప్పటిలాగే తనదైన శైలిలో ని డైలాగులతో మరియు మంచి కామెడీతో ప్రేక్షకులను ఎమోషనల్ చేసే సామర్ధ్యం ఉన్న త్రివిక్రమ్ సరిగ్గా ఈ చిత్రంలో కూడా అదే చేశాడు.


కొంద‌రు ప్లాప్‌ డైరెక్టర్లు గ‌తంలో త్రివిక్రమ్‌తో పాటు ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు ఫామ్‌లో లేక వ‌రుస ప్లాపుల‌తో పాతాళానికి ప‌డిపోయారు. వాళ్లుత్రివిక్రమ్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. గతంలో సినిమాల్లో హాస్యం గుప్పించడంలో ఎంతో దూకుడు ప్రదర్శించిన ఓ దర్శకుడు ఆ తర్వాత వరుస ఫ్లాపులతో క్రమంగా తెరమరుగయ్యాడు. ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్లంతా.. త్రివిక్రమ్ ను చూసి నేర్చుకోవాలంటున్నాడు సగటు సినీ అభిమాని.


ఆసక్తికరంగా కథను ప్రారంభించిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తనదైన డైలాగ్ పంచులతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. త్రివిక్రమ్ మ్యాజిక్‌కు బన్నీ స్టైల్‌, కామెడీ టైమింగ్, పర్ఫామెన్స్‌ తోడై ఫస్ట్‌ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది. బలమైన కథ కాకపోయినా త్రివిక్రమ్‌ తన టేకింగ్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌లు ఆడియన్స్‌ను పలకరిస్తాయి. ఈ సంక్రాంతికి మీరో ఈ సినిమాపై ఓ లుక్కేయండి....

మరింత సమాచారం తెలుసుకోండి: