కొత్త సంవత్సరం అల్లు అర్జున్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి బోణి మామూలుగా చేయలేదు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపుములో సినిమా మధ్యలో నెలకొన్న పోటీకి అభిమానుల నరాలు తెగిపోయాయని చెప్పవచ్చు. చివరికి మహేష్ బాక్సాఫీస్ బద్దలు చేయకపోయిన, సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని యావరేజ్ సినిమాగా నిలిపాడు.

 

 

ఇకపోతే బన్నీ వరుసగా డిజాస్టర్‌లతో సతమతం అవుతున్న సమయంలో అల వైకుంఠపుములో ఆక్సిజన్ అందించిందని అనుకుంటున్నారు. అంతే కాదు బన్నీ మరోసారి తన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను  అద్భుతంగా పండించారు. ఇక సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివికమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా  ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు. ఒకరకంగా ఈ ఏడాది మొదట్లో వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపుములో సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి.

 

 

అయితే స్వతహాగా ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. దాన్ని వారు ప్రతి సినిమాలో రిపీట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ విమర్శను త్రివిక్రమ్ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నాడు.. అదేమంటే ఎప్పుడు చాలామంది మంచి నటీనటులను తన చిత్రాలలో  పెట్టుకున్నా కూడా ఎవరికీ సరైన పాత్ర ఇవ్వడు అని అంతా అంటుంటారు. సరిగ్గా ఇప్పుడు వచ్చినా అల వైకుంఠపురం చిత్రంలో కూడా అదే జరిగిందట.

 

 

నవదీప్ మరియు సునీల్ లాంటి సాలిడ్ నటులను పెట్టుకొని వారిని కేవలం రెండు మూడు సీన్లకే పరిమితం చేయడం అనేది చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదని ఒక టాక్ వినిపిస్తుంది.. అసలు సినిమాలో వారిద్దరి క్యారెక్టర్ లేకపోయినా చిత్రానికి రవ్వంత నష్టం కూడా ఉండదట. ఇదే గాక కనీసం వారితో సంబంధం ఉన్న నటులకైనా కథలో ఏ క్యారెక్టర్ లేదు. అలాంటప్పుడు అసలు వారిని ఎందుకు తీసుకున్నారని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా త్రివిక్రమ్ అవసరమైనంత వరకే నటీనటులను పరిమితం చేస్తే మంచిదని  అభిప్రాయపడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: