ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీ 9న రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ తమిళనాట మంచి విజయం అందుకున్నా తెలుగు రాష్ట్రల్లో మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ లో పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఓ ముఖ్యపాత్రలో నటించారు.  ఈ మూవీ నాట్ బ్యాడ్ అనిపించుకుంది.. కామెడీ పరంగా అలరించింది. 

 

ఇక నా పేరు సూర్య తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ నిన్న రిలీజ్ అయ్యింది.  ఈ మూవీలో ముళీశర్మ... బన్నీతో ఏరా గ్యాప్ తీసుకున్నావ్ అంటే.. తీసుకోలేదు.. వచ్చింది..  అనే డైలాగ్ తో సినిమా రేంజ్ ఏంటో టీజర్ లోనే చెప్పారు. చెప్పినట్లుగానే ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ మరోసారితన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివికమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

 

ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు. పూజాహెగ్డే హీరోయిన్... ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు కనిపించనుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్లపై తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు నిజంగా సంక్రాంతి సంబరం ఏంటో చూపించింది.  వైకుంఠపురం లాంటి అందమైన ఇంట్లో -కుటుంబ సభ్యుల మధ్య అల్లుకున్న కథ ఇది.  మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయ్ గా అల్లు అర్జున్ నటన జేజేలు పలికారు ఆడియన్స్. ఏది ఏమైనా గ్యాప్ తీసుకున్నా అదరగొట్టే హిట్ అందుకున్నాడు అంటున్నారు బన్నీ అభినులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: