మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటోంది. స్టార్ హీరోంద్రు కలిసి కట్టుగా ఉంటున్నారు. ఒకరి సినిమా ప్రమోషన్స్ కి ఒకరు రావడం వేధికపై సరదాగా మాట్లాడటం ఇరు వర్గాల ఫ్యాన్స్ ని ఉత్సాహపరచచడం ఈ మధ్య బాగా చూస్తున్నాము. అందులో భాగంగానే రీసెంట్‌గా సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఫ్యాన్స్ అందరు ఇలా కలిసి కట్టుగా ఉండాలని ఉపదేశించిన సంగతి తెలిసిందే. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

 

అల..కు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆమెరికాలో ప్రీమియర్ షోల నుంచి బాగా వసూలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బన్నీసంక్రాంతి ని మంచి జోష్ తోనే సెలబ్రేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీని ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'చాలా ఇష్టంతో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ ఈజ్... త్రివిక్రమ్ గారి  బ్రిలియంట్ రైటింగ్ వల్ల అల వైకుంఠపురములో చాలా గొప్ప సినిమాగా నిలిచింది. బావా...! సామీలకు కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేసారు. 

 

తారక్ ఇలా ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా. తన తోటి నటుల విషయంలో తారక్ ఎంత చనువుగా ఉంటాడో చెప్పాల్సిన పనిలేదు. తన ఇష్టాన్ని మాటల ద్వారా చూపిస్తుంటారు. ఆ మధ్య 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసి మహేష్ ని 'అన్నా' అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే. మహేష్ ని ఎప్పుడూ అన్నా అని పిలుస్తానని మొదటిసారి మీడియా సమక్షంలో ఓపెన్ అయి ... అభిమానులతో పంచుకున్నాడు. ఇక తారక్ రామ్ చరణ్ తోనూ అంతే స్నేహంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే.

 

తాజాగా బన్నీని 'బావా' అంటూ సంబోధించడంతో అటు తారక్, ఇటు బన్ని అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇలాంటి పిలుపు పరిశ్రమలో...అభిమానుల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి! అన్నది నిజం. అభిమానుల మధ్య వైరాన్ని తొలగించడానికి ఇలాంటి రిలేషన్ షిప్ ని మిగతా హీరోలు కూడా అనుసరించాలి...పాటించాలి. ఇప్పటికే చరణ్...మహేష్...తారక్ ఎంతో స్నేహంతో ముందుకు వెళ్లే ప్రత్నం చేస్తున్నారు. మరి తారక్ కొత్త పిలుపు విషయంలో బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: