నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన కళ్యాణ్ రాం స్టార్ ఇమేజ్ దక్కించుకోవడంలో వెనుకపడ్డాడు. ఒక హిట్టు రెండు ఫ్లాపులు కాదు కాదు ఒక హిట్టు ఆరు ఫ్లాపులు అన్న విధంగా ఆయన కెరియర్ సాగుతుంది. బాబాయ్ తో బాల గోపాలుడు సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రాం తొలిచూపులోనే సినిమాతో హీరోగా తొలి ప్రయంతం చేశాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.. ఆ తర్వాత చేసిన అభిమన్యు కూడా వర్క్ అవుట్ అవలేదు. అయితే రెండు సినిమాల్లో హీరోగా చేసిన కళ్యాణ్ రాం రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే సొంత ప్రొడక్షన్ పెట్టి అతనొక్కడే సినిమా చేశాడు. సురేందర్ రెడ్డిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ తీసిన ఆ సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లో మొదటి హిట్ ఇచ్చింది. 

 

హీరోగా నిర్మాతగా రెండు విభాగాల్లో ఒకేసారి హిట్టు కొట్టాడు కళ్యాణ్ రాం ఇక ఆ తర్వాత అసాధ్యుడు, విజయదశమి సినిమాలు మళ్లీ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ తేజ డైరక్షన్ లో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రాం. ఇక లక్ష్మి కళ్యాణం తో మళ్లీ కెరియర్ లో ఊపందుకున్న కళ్యాణ్ రాం నిర్మాతగా రెండో ప్రయత్నంగా హరేరాం సినిమా చేశాడు. ఆ సినిమా కూడా అతనికి హిట్ ఇచ్చింది. అయితే హరేరాం తర్వాత 8 ఏళ్లుగా వరుస ఫ్లాపులు అందుకున్నాడు కళ్యాణ్ రాం.

 

అనీల్ రావిపుడిని డైరెక్టర్ గా పరిచయ్మ్ చేస్తూ వచ్చిన పటాస్ సూపర్ హిట్ అయ్యింది. పటాస్ హిట్ తో కెరియర్ లో కొత్త ఉత్సాహం ఏర్పరచుకున్న కళ్యాణ్ రాం ఆ తర్వాత మళ్లీ ఇజం, ఎం.ఎల్.ఏ, నా నువ్వే సినిమాలతో కూడా నిరాశపరచాడు. అయితే ఫ్లాపులు వచ్చినా సరే ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తూ ఎంత మొండివాడివిరా అనిపించుకుంటున్నాడు కళ్యాణ్ రాం. లాస్ట్ ఇయర్ 118 సినిమాతో హిట్ అందుకున్న ఈ నందమూరి హీరోసంక్రాంతి కానుకగా ఎంత మంచివాడవురా సినిమాతో వస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు కళ్యాణ్ రాం. మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: