టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న హీరో నేచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో కాస్త ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తుంది. కృష్ణార్జునయుద్దం, దేవదాస్ తర్వాత నాని మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ‘ఆపేసి ఓడినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు’ అంటూ 36 ఏళ్ళ ముదురు క్రికెటర్‌గా ‘జెర్సీ’ తో నాని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో నటించి మరో విజయం అందుకున్నాడు. ఈ మద్య తెలుగు లో మంచి హిట్ అందుకున్న సినిమాలు కోలీవుడ్, బాలీవుడ్ లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే జెర్సీ కోసం నాని నేచురల్ గా ఉండేంది కొంత కాలం క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగినట్లు ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. నానీ పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. క్రికెట్‌కి సంబంధించి పలు షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ బౌన్సర్ షాహిద్ పెదవికి బలంగా తాకడంతో పెదవి చిట్లిపోయి రక్తం కారింది. వెంటనే చిత్ర బృందం షాహిద్‌ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
ఈ ప్రమాదంలో షాహిద్ కి పదమూడు కుట్లు పడ్డాయట. దాంతో కొంత కాలం పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. ఆ సమయంలో పెదవికి తగిలిన గాయం కనిపించకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. షాహిద్‌కి గాయం వలన జెర్సీ రీమేక్ చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ వేశారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ , జాకీ ష్రాఫ్, పాంకే త్రిపాఠి, పంకజ్ కపూర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ హిందీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు.