సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా... సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. ఇక మహేష్ బాబు కామెడీ టైమింగ్ అద్భుతం గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ఈ హిట్ కాంబినేషన్ లో  వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ఖాతాలో మరో విజయం చేరిపోయింది. 

 

ఎప్పుడు క్లాస్ గా కనిపించే మహేష్ బాబు ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్ తో అదరగొట్టాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ మాస్ లుక్ అందరిని ఆకర్షించింది. మహేష్ మాస్ లుక్కుకి తోడు... దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ కూడా తోడవటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అద్భుతమైన  కామెడీ టైమింగ్ తో మహేష్ బాబు ఈ సినిమాలో అదరగొట్టాడు. డాన్స్ లతో కూడా మునుపెన్నడూ లేని విదంగా మహేష్ తన సత్తా చాటాడు. ఒక సాధారణ కథకి తనదైన స్టైల్ కామెడీని జోడించి  ప్రేక్షకులందరినీ అలరించి  బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది.

 

 

ఇక పోతే తాను నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్పందించిన మహేష్ బాబు ఫాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను  అని ప్రకటించారు మహేష్ బాబు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్  పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వచ్చిన స్పందన పై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు మహేష్ బాబు.ఫాన్స్ తన పై ప్రశ్నలు సంధించండి  అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: