సినిమాల్లో రోజులు బాగున్నప్పుడే నాలుగు రాళ్లూ వెనకేసు కోవాలని చెబుతారు అనుభవజ్ఞులు. ఇలా ఎందుకు చెప్పారో కొంతమందిని చూసి అర్ధం చేసుకోవచ్చూ. అవకాశాలు బాగున్నప్పుడు ఒక వెలుగు వెలిగి, అవకాశాలు సన్నగిల్లగానే చీకట్లో బ్రతుకుతున్న ఆర్టిస్టులు ఎందరో కనిపిస్తారు. సమయానికి డబ్బులు లేక. అనారోగ్యాల పాలైన సమయంలో హాస్పిటల్స్‌లో చూపించుకోలేక నానా అవస్దలు పడి చివరకు అంత్య క్రియలకు కూడా రూపాయి లేకుండా మరణించిన వారి గురించి ఇదివరకే తెలుసు..

 

 

ఇకపోతే ఇప్పుడు సుధాకర్ పరిస్దితి ఎలా ఉందో తెలియదు గాని ఆయన ఫోటో చూస్తే మాత్రం జాలి పడక తప్పదు. ఒకప్పుడు ఈ నటుడు లేని సినిమా లేదు. ఈయనతో నటించని హీరో లేడు. ఇకపోతే రోజంతా ఎంత అలసటగా ఉన్నా, హాయిగా నవ్వుకుంటే ఎలాంటి ఇబ్బంది అయినా తొలిగి పోతుందని తెలిసిన విషయమే. ఇక మన  టాలివుడ్ లో దాదాపు 70మంది కమెడియన్స్ ఉన్నారు. ఇందులో ఒకప్పుడు టాప్ కమెడియన్ గా నిల్చిన సుధాకర్ హాస్యానికి తనదైన మార్క్ తెచ్చాడు. కడుపుబ్బా నవ్వించేవాడు. అయితే అతడి పరిస్థితి చూస్తే, చాలా దయనీయంగా మారింది.

 

 

ఒకప్పుడు ఎందరినో నవ్వించిన సుధాకర్ 2010లో జూన్ 29న అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చేరి, కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కోలుకున్నాడు. అయితే ఎవరూ ఇప్పుడు సుధాకర్ ని పట్టించుకోవడం లేదు. అయితే ఆమధ్య ఒక మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసాడు. ‘ఒరే నాన్నా..’ అంటూ తండ్రిని ముద్దు ముద్దుగా తిట్టడం, పితుహు వంటి డైలాగులు చెప్పి నవ్వించడం ఒక్క సుధాకర్ కే దక్కుతుంది. తమిళ ,తెలుగు ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగిన సుధాకర్ విలక్షణ కామెడీకి పెట్టింది పేరు. మళ్ళీ ఛాన్స్ లిస్తే మునుపటిలా నవ్విస్తానని అంటున్నాడు.

 

 

ఇక సుధాకర్ చేసిన సినిమాల సంఖ్య దాదాపు 600 వరకు ఉంటుంది. కర్నూల్ జిల్లా కోయిలకుంట్లలో పుట్టిన సుధాకర్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కి పైగా సినిమాల్లో చేసి, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి టాప్ కమెడియన్ అయ్యాడు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లో రూమ్ మేట్ అయిన సుధాకర్ నాలుగు సినిమాలు కూడా నిర్మించాడు.

 

 

హిందిలో కూడా ఎంట్రీ ఇచ్చి నటించాడు. అలాంటి సుధాకర్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడటం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరు ఒకప్పుడు సుధాకర్‌తో నటించిన వారే మరి వీరు తలా ఓ చెయ్యి వేస్తే సుధాకర్ ఎప్పటి సుధాకర్‌లా బ్రతుకుతాడని అందరు అనుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: