స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో' రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే హిట్ టాక్ ను సంపాదించింది. అయితే, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో చిత్ర బృందం ఇప్పటికే సంక్రాంతి విన్నర్ పేరుతో ఒక ప్రోమోని విడుదల చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చిత్ర టీమ్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ చిత్ర సమావేశంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆయన మాట్లాడుతూ... 'అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాములో రాములా పాట హిట్ అవ్వడానికి కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు( తనే అన్నట్లు తన టీషర్ట్ ను ఎగరేస్తూ నవ్వులు పూయిస్తారు). నేను ఇక్కడికి వచ్చింది నా క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ విషయాన్ని తెలియజేయడానికి. నాకు బైపాస్ సర్జరీ అయినాక బన్నీ నన్ను పరామర్శించడానికి వచ్చాడు. మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్ అంటూ మీరు సర్జరీ తరువాత చేసే మొట్టమొదటి సినిమా నాదే అని చెప్పాడు. ఏదో నన్ను ఉత్సహపరచడానికి అల అన్నాడేమో అనుకున్న కానీ తరువాత త్రివిక్రమ్ వచ్చారు. సార్, మనం కలవబోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. వారి సినిమా షూటింగ్ పూర్తయ్యి ప్రమోషన్ కోసం నన్ను పిలుస్తున్నారేమో అని అనుకున్నా. కానీ వీళ్లిద్దరూ మాట్లాడుకొని నాకు సినిమాలో ఒక క్యారెక్టర్ ఇద్దామనుకున్నారు. అసలు ఒక మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకోవడానికి కష్టపడే అతి తక్కువ వారిలో బన్నీ, త్రివిక్రమ్ ఒకరు' అంటూ మాట్లాడారు.


అలాగే తాను మాట్లాడుతూ... బన్నీ ఎంత స్టార్డం తెచుకున్నప్పటికీ కొత్తగా వచ్చిన హీరోలాగానే బాగా కష్టపడతాడు. షూటింగ్ లో ఒక స్టెప్ సులువుగా చేస్తే.. అల ఎలా చేశావయ్యా అని అడిగితే.. రాత్రి 11గంటల వరకు ప్రాక్టీస్ చేసానని చెప్పాడు. దటీస్ బన్నీ అంటూ బ్రహ్మానందం బాగా కొనియాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: