కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా ఇటీవల అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా తమిళ్ లో పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్  దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా సినిమా మాస్టర్. ఇటీవల కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా లోకేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక ప్రస్తుతం లోకేష్, విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ మాస్టర్ సినిమాని కూడా ఒక వెరైటీ మూవీగా తీస్తున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

 

హీరో విజయ్ తో పాటు విలన్ పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి రోల్ కూడా సినిమాలో ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నింటిలోకి ఈ మాస్టర్ సినిమా ద్వారా విజయ్ సేతుపతికి మరింత పేరు రావడం ఖాయం అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.78 కోట్లవరకు జరిగిందని, అలానే mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమా తెలుగు రైట్స్ ని రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. నిజానికి ఇళయదళపతి విజయ్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. 

 

అందుకే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం కొంత పోటీ జరుగగా, చివరికి మహేష్సినిమా హక్కులు దక్కించుకున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఎక్స్ బి ఫిలిం క్రియేటర్స్ బ్యానర్ పై గ్జేవియర్ బ్రిటో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీని, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఆండ్రియా జెరెమియా, మాళవిక మోహనన్, నాజర్, శ్రీమాన్, సంజీవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: