సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం  సరిలేరు నీకెవ్వరు. హీరో మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతుండడం... దర్శకుడు అనిల్ కపూర్ కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 11న సంక్రాంతి ముందు ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది సినిమా. మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నప్పటికీ సంచలన వసూళ్లు  రాబడుతు  దూసుకుపోతుంది.ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది సరిలేరు నీకెవ్వరు చిత్రం. 

 

 

 

 ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా విజయంతో మహేష్ బాబు ఖాతాలో  మరో సంచలన విజయం చేరిపోయింది.ఇకపోతే సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘన విజయం తో మహేష్ బాబు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.  ఈ క్రమంలోనే  ఆయన అభిమానులతో ట్విట్టర్లో లైవ్ చాట్ నిర్వహించారు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అభిమాన హీరో మహేష్ బాబు తమతో లైవ్ చాట్ చేయడంతో అభిమానులు అందరూ సంబరపడిపోయారు.ఈ  సందర్భంగా ఓ అభిమాని దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటు  మహేష్ బాబు ని కోరారు. దీనిపై స్పందించిన మహేష్ బాబు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. 

 

 

 

 దర్శకుడు అనిల్ రావిపూడి లో అపారమైన ఎనర్జీ ఉంటుంది అని కొనియాడారు మహేష్ బాబు. అమోఘమైన ప్రతిభ కూడా అనిల్ రావిపూడి సొంతమని ప్రశంసించారు. వచ్చే  దశాబ్దం మొత్తం అనిల్ రావిపూడిదేనని  మహేష్ బాబు తెలిపారు. వచ్చే  దశాబ్దకాలం పాటు అనిల్ రావిపూడి తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తాడు అంటూ జోస్యం చెప్పారు మహేష్ బాబు. తాను చాలా మంది దర్శకులతో పని చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం అనిల్ తో పనిచేయడం లేదు సరికొత్త అనుభూతిని ఇచ్చింది అంటూ మహేష్ బాబు తెలిపారు. సినిమా సెట్స్  లో నవ్వుతూ నవ్విస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారని... అదే సమయంలో చిత్రయూనిట్ మొత్తం తన నియంత్రణలో ఉండేలా అనిల్ రావిపూడి చూసుకుంటాడు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: