తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది కాజల్. మొదటి సినిమాలో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన తర్వాత గ్లామర్ పాత్రలో ఎక్కువగా నటించింది కాజల్. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా  మారిపోయింది. ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలందరితో నటించింది. మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఘనత కాజల్ కే దక్కింది. గత కొంత కాలంలో టాలీవుడ్ లో కాజల్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు దాంతో దక్షిణాది వైపు దృష్టి పెట్టింది.

 

కాజల్ టాప్ హీరోయిన్ అయినప్పటికీ  యంగ్ హీరోలతో కూడా నటించడానికి సై అంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో   ఓ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినా కాజల్ గ్లామర్  ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సీత.,రణరంగం  సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు కలిసి ఉన్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన కోమలి మూవీ 25 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా యువ హీరో తనయుడు దుల్కర్ సల్మాన్ తో ఓ మూవీలో నటించబోతున్న టు సమాచారం.

 

ప్రస్తుతం రొమాంటిక్ కథ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే హీరోయిన్ విషయంలో క్లారిటీ  మాత్రం రాలేదు.   ప్రస్తుతం ఈ అమ్మడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2  మూవీ లో నటిస్తున్నట్లు తెలిసిందే. వాస్తవానికి కాజల్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు కానీ బాలీవుడ్ ముంబై సాగా సినిమా పై ఆశలు పెట్టుకుంది. ఎప్పటి నుంచో బాలీవుడ్లో ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాజల్ కి ఈ మూవీ సక్సెస్ అయితే..   తనకు కలిసి వస్తుందని భావిస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: