త్రివిక్రమ్ సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ గానే ఉంటాయి. ఆయన చేసే ప్రతీ సినిమాలోనూ ఫ్యామిలీ ఎలిమెంట్ తప్పకుండా ఉంటుంది. అయితే ఈ మధ్య అది మరింత ఎక్కువగా పెరుగుతోంది. అత్తారింటికి దారేది సినిమా మొదలుకుని అది మరింత పెరిగింది.  ఆ సినిమా అప్పుడు ఎంతలా ఆడిందో అందరికీ తెలిసిందే. అయితే అదే పంథాలో తన మిగతా సినిమాలన్ని నడుస్తున్నాయనే అపవాదు కూడా నడుస్తోంది.

 

అత్తారింటికి దారేది మొదలుకుని అ ఆ, అజ్ఞాతవాసి ఇప్పుడు అల వైకుంఠపురములో వరకు ఆయన అన్నీ ఫ్యామిలీ సబ్జెక్ట్లులే ఎంచుకుంటున్నాడు. హీరో రావడం ఫ్యామిలీలో సమస్యలని పరిష్కరించడం ప్రతీ సారి ఇదే చేస్తుంటే ప్రేక్షకులకి బోర్ కొట్టేస్తుంది. అల వైకుంఠపురములో సినిమా కొంచెం విభిన్నంగా ఉన్నప్పటికీ అదే ఛాయలు కనిపిస్తాయి. అయితే త్రివిక్రమ్ అది దాటి రావాలని ఆశిస్తున్నారు.

 

అయితే అలా దాటడం వల్ల మళ్ళీ తన మార్క్ కోల్పోతాడేమో భయం కూడా ఉంది. కానీ త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఒకే జోనర్ లో ఇమిడిపోతే బాగుండదు. ఆయన మరిన్ని జోనర్లలో సినిమాలు చేయాలి. ఒక ఖలేజా... లాంటి సినిమాలు రావాలి. ఖలేజా సినిమా ఫ్లాప్ అయి ఉండవచ్చు. కానీ ఆ సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. చాలా మంది త్రివిక్రమ్ అభిమానులు ఖలేజా తమ ఫేవరేట్ అని చెప్పుకుంటారు.

 

అందుకే త్రివిక్రమ్ ఇక నుండి తన కథల్లో వైవిధ్యం ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఇక ఫ్యామిలీ డోస్ ని వదిలేసి ఎంటర్ టైనర్ వైపు వెళ్తే బాగుంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. త్రివిక్రమ్ తో చేసే హీరోలందరూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే కోరుకుంటారు కాబట్టి త్రివిక్రమ్ అవే తీస్తాడా లేదా పంథా మార్చుకుని కొత్తగా ట్రై చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: