టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ తమిళ నాట మంచి కలెక్షన్లు రాబడుతున్నా.. తెలుగులో అంతంత మాత్రమే అంటున్నారు. ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవి మిశ్రమ స్పందన వచ్చింది.  మొదటి రెండు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చాయి.  ఇక త్రివిక్రమ్ - అల్లు అర్జున్ నటించిన  అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యింది. 

 

రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది.  ఈ మూవీ కలెక్షన్లు భారీగానే రాబడుతున్నాయి.  ఈ రోజు విఘ్నష్ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచివాడవురా మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ఈ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే.  నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీమియం టాక్ వచ్చేసింది.   ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దిన్నట్లు దర్శకులు తెలిపారు.  రెండేళ్ల క్రితం విఘ్నేష్ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ మూవి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

 

ఇదే తరహాలో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కించారని అందరూ భావించినా.. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఆడియన్స్ అంటున్నారు. సంక్రాంతి బరిలో రెండు మూడు సినిమాలైనా ఆడేస్తాయి అనేది నిజం.. అందుకే ఫామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి బరిలో ఈ ‘ఎంత మంచివాడవురా’ అని రిలీజ్ చేశారు. కానీ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం వలన అనుకున్న రేంజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడగలదా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఎంత వరకు ఉపయోగపడగలదో రేపటి కలెక్షన్లను బట్టి తెలుస్తుంది. ఈ 3 రోజులు ఫెస్టివల్ వలన కలెక్షన్స్ పరవాలేధనిపించినా లాంగ్ రన్ లో చాలా కష్టమే అంటున్నారు ఆడియన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: