యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ఎంత మంచివాడవురా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించింది. ఇక ఈ సినిమా తొలి షో నుండి అందుతున్న సమాచారం ప్రకారం, తన గత సినిమాల మాదిరిగా దర్శకుడు సతీష్సినిమా కోసం కూడా ఒక మంచి హృద్యమైన కథాంశాన్ని ఎంచుకోవడంతో పాటు దానిని ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీసాడని అంటున్నారు. శ్రీదేవి మూవీస్, ఆదిత్య మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ నటించగా, విలన్ పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు. 

 

ఇక ప్రేక్షకులు చెప్తున్న టాక్ ప్రకారం, గతంలో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ లాగా, ఇది అతని కెరీర్‌లో మరో బిగ్గెస్ హిట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తోనే రూపొందించడం, ఎక్కువ హైప్ లేకపోవడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యేలా ఉండటం ఇవన్నీ ఎంత మంచివాడవురాకి ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ సీన్స్ పెట్టి కథను నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ తో కథను ముందుకు తీసుకెళ్లాడని అంటున్నారు. అలానే తన సినిమాల్లో యాక్షన్ కు పెద్దగా చోటివ్వని దర్శకుడు సతీష్
సినిమా కోసం కళ్యాణ్ రామ్ తో కొన్ని ఫైట్స్ కూడా చేయించాడట.

 

ముఖ్యంగా హీరో కళ్యాణ్ రామ్ తో పాటు సీనియర్ నటులు సుహాసిని, శరత్ బాబుల నటన కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని, అలానే కథను చాలావరకు అన్ని వర్గాల ప్రేక్షకులను చేరువ చేసేలా దర్శకుడు మలిచిన విధానం ఎంతో బాగుందని అంటున్నారు. వాస్తవానికి మధ్యలో అక్కడక్కడా కొంత ల్యాగ్స్ ఉన్నప్పటికీ కూడా, ఓవర్ ఆల్ గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: