శ్రీనివాస్ రెడ్డి అనగానే కామెడీ సినిమాలకు కేరాఫ్ అ్రడస్ గా మారిన డైరెక్టర్ తో నితిన్ సినిమా చేయడం ఏంటనేగా మీ డౌట్..? మనోడు లవ్ స్టోరీలతో తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు కామెడీ సినిమా తీస్తాడా.. అనుకుంటున్నారేమో. అలా కాదు లేండి కమర్షియల్ సినిమాలను పెద్ద పెద్ద హీరోలతో తీసే డైరెక్టర్ సురెందర్ రెడ్డి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసిన శ్రీనివాస్ రెడ్డి నితిన్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సురెందర్ రెడ్డి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు సక్సెస్ లతో దూసుకు పోతున్న నితిన్ తో మూవీ ప్లాన్ చేయబోతున్నాడు. సురెందర్ రెడ్డి దగ్గర చేసిన అనుభవంతో ఇప్పుడు ఈ మూవీని తీస్తున్న ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాలను ప్రిఫర్ చేస్తాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్ కి మరో హిట్ ఇవ్వగలడా..? అనేది ఆలోచించాలి. చాలా కాలం గా హిట్ కోసం వెయిట్ చేసిన ఈ లవర్ బాయ్ ఇష్క్ తో మొదలై గుండెజారి గల్లంతయిందే మూవీ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. నితిన్ మంచి ఫామ్ లో ఉండడంతో అ్రగ డైరెక్టర్లు కూడా నితిన్ తో సినిమా తీయడానికి సై అంటున్నారు.. ప్రస్తుతం నితిన్ పూరీ డైరెక్షన్ లో హార్ట్ ఎటాక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. . ఈ మూవీ తో నితిన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని కూడా నితిన్ అభిమానులు డిసైడ్ అయ్యారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి భారీ రెస్పాంటే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ ని పెంచేస్తుంది. సో మొత్తానికి మరళ ఫాం లో కి వచ్చిన నితిన్ కొత్త వారిని కూడా ప్రోత్సహించడం చెప్పుకోదగ్గ విషయమే. మరి ఇతని నమ్మకాన్ని కొత్త దర్శకులు నిలబెడటారో లేదో సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయ్యేదాకా చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: