ప్రస్తుతతం తెలుగులో ఇప్పుడున్న హీరోయిన్లలో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ పూజ హెగ్డే పేరు బాగా వినిపిస్తోంది. ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉంది అంటే ముందు హీరోయిన్ గా పూజా గురించే చిత్ర యూనిట్ డిస్కస్ చేస్తోంది. ఇప్పటి వరకూ పెద్ద స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వచ్చింది కానీ ఏ ఒక్కటి సాలిడ్ హిట్ అనిపించుకోలేదు. అయితే ఈసారి సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో' మాత్రం పూజకు ఆ లోటు తీర్చేలా కనిపిస్తోంది. 12 న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  ఇక తాజాగా 'అల వైకుంఠపురములో' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పూజ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

 

కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి గ్రేట్ డ్యాన్సర్లతో పని చేయడంవల్ల డ్యాన్స్ అలవాటు అయిపోయిందని తెలిపింది. ఈ సినిమాలు తనకు సింపుల్ స్టెప్స్ ఉనడడంతో పెద్దగా కష్టం అనిపించలేదని వెల్లడించింది. ఈ సినిమాలో బన్నీని మ్యాచ్ చేసేలా డ్యాన్స్ చేశానని అనుకుంటున్నాని తనకి తానే చెప్పుకుంది. ఇక అల సినిమాలో పూజా ఫేవరెట్ సీన్ బుట్టబొమ్మ పాటకు ముందుగా వచ్చే లీడ్ సీన్ ఇష్టమట. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా బాగుంటుందని అల సినిమాలో పూజాకి బాగా నచ్చిన సీన్స్ గురించి తెలిపింది. ఈ రెండు సీన్లు సరదాగా ఉంటాయని చెప్పింది. ఇవి కాకుండా మరో సీన్ కూడా తనకు ఇష్టమని.. అయితే ఆ సీన్ కట్ చేశారని త్వరలో దాన్ని కూడా త్వరలో కలుపుతారేమోనని తెలిపింది. 

 

ఇక పూజా బన్నీకి ఫ్యాన్ అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బన్నీతో పని చేయడం ఎంజాయ్ చేస్తాను. ప్రభాస్ తో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది" అని చెప్పిన పూజా నెటిజన్స్ నుండి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అరవింద సమేతలో తారక్ తో నటించారు కదా ..మరి పదే పదే బనీ గురించే చెప్తున్నారెందుకు అంటూ కామెన్స్ చేస్తున్నారు. ఇక పూజా బాలీవుడ్ లో చేయబోయే మరో ప్రాజెక్టు గురించి కూడా ఒక హింట్ ఇచ్చింది. అంతేకాదు మరోసారి హృతిక్ రోషన్ నెక్స్ట్ సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపింది. 


   

మరింత సమాచారం తెలుసుకోండి: