ప్రతీ సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య పోటీ ఉంటుందని అందరికీ తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నింటిలో తమదే టాప్ సినిమా అని చెప్పుకోవడం చాలా మందికి ఇష్టం. అలా అనే కాదు ఈ సంక్రాంతికి విడుదల అయిన ఏ సినిమా బాగుందోనని ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. రివ్యూవర్లు సైతం ఈ సంక్రాంతి వాళ్లదే అని తమకి నచ్చిన సినిమా గురించి చెప్పేస్తూ ఉంటారు. 

 

అయితే ఈ సారి సంక్రాంతి ఉన్న పోటీ మామూలుగా లేదు. రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం మొదలైంది. ఈ రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ రావడం కూడా బాగా కలిసొచ్చింది. ఇప్పుడు పోటీలో మరింత ఆసక్తి నెలకొంది. అసలు సినిమాలు రిలీజ్ అవక ముందే ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నడిచింది. సినిమా పోస్టర్ల నుండి మొదలుకుని విడుదల వరకు ప్రతీ దానిలోనూ పోటీ కనిపించింది.

 

ఆ పోటీ విడుదల తర్వాత కూడా కనిపిస్తుంది. కలెక్షన్ల రూపంలో మేమింత సంపాదించాం అంటే మేమింత సంపాదించాం అనుకుంటూ ఒకరికంటే మరొకరు చెప్పుకుంటున్నారు. అది ఇంకాస్త పెరిగి పెరిగి ఈ సారి సంక్రాంతికి విన్నర్ మేమే అని ఒకరంటే సంక్రాంతికి మొగుడిని మేమే అని చెప్పుకుంటున్నారు. బన్నీ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాని సంక్రాంతి విన్నర్ గా చెప్పుకుంటున్నారు.

 

అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాని సంక్రాంతి మొగుడిగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రేక్షకుల్లో ఈ రెండు సినిమాలకి సమాన ఆదరణ కనిపిస్తుంది. ఒకటి మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటే మరోటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి విడుదల అయిన రెండు పెద్ద సినిమాలు కూడా విన్నర్ అయినట్లే.. అయితే వీటి గోలలో పడి మిగతా సినిమాల పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: