బాలక్రిష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాలయ్యకి చాలా చెడ్డ పేరును కూడా తీసుకువచ్చింది. ఈ సినిమాకి విడుదల ముందు నుండి కూడా పాజిటివ్ బజ్ ఏర్పడలేదు. దానికి తోడు సినిమాలో బాలయ్య లుక్ కూడా బాలేదనే టాక్ వచ్చింది. టోనీ స్టార్క్ గా బాలయ్య లుక్ బాగున్నప్పటికీ పోలీస్ ఆఫీసరుగా బాలయ్య లుక్ అస్సలు బాలేదని అన్నారు

 

.

ఈ సినిమాకి ప్రేక్షకులు రాకపోవడం వెనక బాలయ్య లుక్ బాలేదనే టాక్ కూడా బాగా పనిచేసింది. అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నాడు. బోయపాటితో ఇప్పటికే రెండు చిత్రాలు చేసిన బాలయ్యకిది బోయపాటితో మూడవ చిత్రం. సాధారణంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రం గురించి అంచనాలు బాగానే ఉండేవి. కానీ రూలర్ పరాజయం తర్వాత పరిస్థితి మారిపోయింది. అయితే బొయపాటి సినిమాలో బాలయ్య లుక్ మారిపోయిందట.

 

 


పూర్తిగా అభిమానులకి నచ్చే లుక్ లోకి మారిపోయాడట బాలయ్య. బోయపాటితో బాలయ్య చేసిన సినిమాల్లో లెజెండ్ , సింహా చిత్రాల్లో బాలయ్య లుక్ బాగుంటుంది. ఆ సినిమాల్లోలాగే తన తర్వాతి చిత్రంలోనూ అభిమానులకి నచ్చే లుక్ లోకి మారిపోయాడట. . వారి ఆశలకు తగ్గట్టే డైనమిక్ లుక్‌లోకి మారిపోయారట బాలయ్య. కోర మీసం, రెగ్యులర్ హెయిర్ స్టైల్ చేసుకుని ఆకట్టుకునేలా ఉన్నాడని సమాచారం.

 


ఇప్పటికైతే ఈ లుక్ బయటకి రాలేదు. మరి బయటకి వస్తే ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇక బాలయ్య బోయపాటి సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్ర చేస్తుండగా, కేథ్రరిన్ త్రెసా హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ద్వారానైనా బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: