ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఫస్ట్ మూవీతో మంచి హిట్ కొట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న, ఆ తరువాత యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవదకొండతో కలిసి గీత గోవిందంలో నటించి మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లో నటించిన రష్మిక, ఆ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో రన్ అవుతుండడంతో ఎంతో ఖుషీగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ సరసన భీష్మతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, బన్నీ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుందట. డిఫరెంట్ గా స్టోరీలు ఎంచుకుని, 

 

వాటిని ప్రేక్షకుడికి నచ్చేలా మరింత వెరైటీగా తీయడంలో పేరున్న సుకుమార్, ఈ సినిమాను కూడా ఎంతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగె మాస్, యాక్షన్ డ్రామా అని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా ఎంతో మాస్ గా  కనపడతారని, అంతేకాక హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ ఈ సినిమాలో ఒకింత సీరియస్ యాక్షన్ తో కూడిన పాత్ర అని సమాచారం. సరిలేరు నీకెవ్వరు లో తన కామెడీతో ప్రేక్షకులను ఎంతో గిలిగింతలు పెట్టిన రష్మిక

 

దానికి పూర్తిగా విభిన్నంగా సాగె సీరియస్ పాత్రలో నటిస్తోందని, అయితే ఆ పాత్రలో ఆమె పలికించే ఎమోషన్స్, ఫీల్ ఎంతో అదిరిపోతాయని, అలానే సినిమా రిలీజ్ తరువాత నటిగా రష్మిక కు మంచి పేరు రావడం ఖాయం అని సినిమా యూనిట్ అభిప్రాయపడుతోందట. ఇక సరిలేరు బాగానే ఆడుతుండడంతో మంచి జోరుమీదున్న ఈ కన్నడ భామకు మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయట. అయితే వాటిని ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి ఎంపిక చేస్తోందట రష్మిక. మరి ఈ ఏడాది ఆమె ఇంకెన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: